Begin typing your search above and press return to search.

ప్రభాస్ హను.. ఆమెనే ఎందుకంటే..

మొదటి చిత్రమే ఏకంగా ఇండియన్ నెంబర్ వన్ స్టార్ కి జోడీగా నటించే ఛాన్స్ అందుకోవడంతో ఒక్కసారిగా ఈ బ్యూటీ సెన్సేషన్ అయిపోయింది.

By:  Tupaki Desk   |   20 Aug 2024 2:18 PM GMT
ప్రభాస్ హను.. ఆమెనే ఎందుకంటే..
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో న్యూ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు. ఇక భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్, టి- సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ మూవీ ప్రారంభోత్సవం జరిగింది. ఈ చిత్రంలో సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా ఎంపికైంది. మొదటి చిత్రమే ఏకంగా ఇండియన్ నెంబర్ వన్ స్టార్ కి జోడీగా నటించే ఛాన్స్ అందుకోవడంతో ఒక్కసారిగా ఈ బ్యూటీ సెన్సేషన్ అయిపోయింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇమాన్వి ఇస్మాయిల్ గురించి సోషల్ మీడియాలో డార్లింగ్ ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రభాస్ కి జోడీగా ఆమెని ఎంపిక చేయడానికి కారణం ఏమై ఉంటుంది అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇమాన్వి డాన్స్ వీడియోలు చాలా మందిని ఎట్రాక్ట్ చేశాయి. అందులో మంచి ఎక్స్ ప్రెషన్స్ తో ఇమాన్వి అద్భుతమైన డాన్స్ తో అలరిస్తూ ఉంటుంది. ఈ వీడియోలకి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే ఇమాన్వి ఇస్మాయిల్ ని ఫౌజీ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేయడానికి కారణం ఏంటనేది తాజాగా దర్శకుడు హను రాఘవాపూడి క్లారిటీ ఇచ్చారు. ఇమాన్విని తాను సోషల్ మీడియాలోనే చూశానని చెప్పారు. అందులో ఆమె డాన్స్ వీడియోలు భాగా ఆకట్టుకున్నాయి.. ఇన్ స్టాగ్రామ్ ద్వారానే ఇమాన్విని సంప్రదించడం జరిగింది. ఆడిషన్స్ కి రమ్మని చెప్పాము. 15 రోజుల పాటు ఆడిషన్స్, స్క్రీన్ టెస్ట్ నిర్వహించాం.

ఆ స్క్రీన్ టెస్ట్ వీడియోలని ప్రభాస్ కూడా చూసిన తర్వాత సినిమాలోని క్యారెక్టర్ కి ఇమాన్వి పెర్ఫెక్ట్ గా సెట్ అవుతుందనే నిర్ణయానికి వచ్చి ఆమెని హీరోయిన్ గా ఎంపిక చేయడం జరిగిందని హను రాఘవపూడి క్లారిటీ ఇచ్చారు. ఇమాన్వి ఎప్పటి నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని ఎదురుచూస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో మేగ్జిమమ్ ఆమె ఫోటోలు కూడా చాలా ట్రెడిషనల్ స్టైల్ లో ఉంటాయి. మోడ్రన్ గా కనిపించిన కూడా మరీ టూ మచ్ గ్లామర్ షో ఉండదు.

ఫౌజీ మూవీ ప్రారంభోత్సవంలో కూడా ఇమాన్వి చక్కగా చీరకట్టులో తెలుగింటి అమ్మాయిలా అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఉండబోతోందనే మాట వినిపిస్తోంది. హను రాఘవపూడి పరిచయం చేసిన హీరోయిన్స్ అందరూ కూడా టాలెంటెడ్ యాక్టర్స్ గా ప్రూవ్ చేసుకున్నారు. ఆయన సినిమాలో కథానాయకి పాత్రలకి కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఇమాన్వి మంచి లక్కీ ఛాన్స్ ని అందుకుందనే మాట వినిపిస్తోంది.