Begin typing your search above and press return to search.

నేను ఎప్పటికీ నీ అభిమానినే : సమంత

రానా బర్త్‌ డే సందర్భంగా సమంత... హ్యాపీ బర్త్‌డే మై డియర్‌ రానా, ఏ పని చేసినా నువ్వు 100% ఎఫర్ట్ పెట్టడం నాకు నచ్చుతుంది.

By:  Tupaki Desk   |   14 Dec 2024 12:08 PM GMT
నేను ఎప్పటికీ నీ అభిమానినే : సమంత
X

టాలీవుడ్‌ స్టార్‌ రానా బర్త్‌ డే సందర్భంగా ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రామ్‌ చరణ్ మొదలుకుని ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ రానాతో తమకు ఉన్న అనుబంధం, ఆయనలోని గొప్ప విషయాలను సోషల్‌ మీడియా ద్వారా చెబుతూ వచ్చారు. నెట్టింట ఆ విషయాలు వైరల్‌ అవుతున్నాయి. ఎంతో మంది సెలబ్రిటీలు రానాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసినా సమంత చేసిన సోషల్‌ మీడియా పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రానాతో సమంతకు ఉన్న సన్నిహిత సంబంధాలను ఆమె పోస్ట్‌ చెప్పకనే చెబుతోంది.

రానా బర్త్‌ డే సందర్భంగా సమంత... హ్యాపీ బర్త్‌డే మై డియర్‌ రానా, ఏ పని చేసినా నువ్వు 100% ఎఫర్ట్ పెట్టడం నాకు నచ్చుతుంది. నువ్వు శ్రమించే తత్వం నాలో ఎంతగానో స్ఫూర్తిని నింపింది. నేను ఏ పని చేసినా ఇంకా బాగా చేయాలి అని అది ప్రోత్సహిస్తుంది. నేను ఎప్పటికీ నీ అభిమానినే. దేవుడి ఆశీస్సులు నీకు ఉండాలని కోరుకుంటాను అంటూ పోస్ట్‌ చేసింది. సోషల్‌ మీడియాలో సమంత చేసిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. రానా గురించి సమంతకు ఉన్న పాజిటివ్ ఓపీనియన్‌ను చూసి ఆశ్చర్యంగా ఉంది అంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో ఒక సినిమా కోసం రానా, సమంతలు స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. పైగా నాగ చైతన్య ను సమంత పెళ్లి చేసుకున్న నేపథ్యంలో బంధువులుగా కూడా మారిన విషయం తెల్సిందే. నాగ చైతన్య నుంచి విడిపోయిన తర్వాత రానాతో సమంత బంధుత్వం తెగినా స్నేహం మాత్రం కొనసాగుతూనే ఉంది. నాగ చైతన్యతో ఉన్న సమయంలో రానాతో సోదరిగా సమంత మెలిగేది అని, ఇద్దరి మధ్య అన్న చెల్లి అనుబంధం బాగుండేది అంటూ కొందరు అక్కినేని ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్నారు. రానా గురించి పలు సందర్భాల్లో విడాకుల తర్వాత సమంత స్పందించిన విషయం తెల్సిందే.

సమంత ఇటీవలే సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ వెబ్‌ సిరీస్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆమె నుంచి మరిన్ని వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ప్రస్తుతం ఈమె చేస్తున్న బంగారం సినిమా ఉంటుంది అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా పోస్ట్‌లు చేస్తూ వైరల్‌ అవుతున్న సమంత ఇప్పుడు రానాకి బర్త్‌ డే శుభాకాంక్షలు చెప్పడం ద్వారా వైరల్ అవుతోంది.