Begin typing your search above and press return to search.

అధికారికం: హార్థిక్ పాండ్యా- న‌టాషా విడాకులు

కలిసి ఆనందించిన స‌మ‌యాలు.. ప‌రస్పర గౌరవం.. సాంగత్యం.. మేము ఒక కుటుంబంగా ఎదుగుతున్న‌ప్పుడు తీసుకోవాల్సిన‌ కఠిన నిర్ణయమిది'' అని నోట్ లో అత‌డు రాసాడు.

By:  Tupaki Desk   |   19 July 2024 3:26 AM GMT
అధికారికం: హార్థిక్ పాండ్యా- న‌టాషా విడాకులు
X

ఇంత‌కు ముందే న‌టాషా స్టాంకోవిచ్ భార‌త‌దేశం విడిచి త‌న స్వ‌దేశానికి వెళ్లిపోయింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇంత‌లోనే ఇప్పుడు హార్దిక్ పాండ్యా -నటాషా స్టాంకోవిచ్ విడిపోయార‌ని క‌థ‌నాలొచ్చాయి. అన్ని ఊహాగానాలకు ముగింపు ఇస్తూ క్రికెటర్ హార్థిక్ పాండ్యా గురువారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో విడాకుల‌ను ధృవీకరిస్తూ ఒక నోట్ రాసారు. తాము విడిపోవాలని పరస్పరం నిర్ణయించుకున్నట్లు నోట్ లో పేర్కొన్నాడు. అయితే తమ మూడేళ్ల కొడుకుకి సహ-తల్లిదండ్రులుగా కొనసాగుతామని తెలిపారు.

T20I కెప్టెన్సీ రేసులో సూర్యకుమార్ యాదవ్ కి వైస్ కెప్టెన్సీని కోల్పోయిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం ఎదురైంది. ''4 సంవత్సరాల పాటు కలిసి ఉన్న తర్వాత నటాషా, నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాము'' అని తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పాండ్యా సుదీర్ఘ నోట్ రాశాడు.

''మేము కలిసి ఉండ‌టానికి మా వంతు ప్రయత్నం చేసాం. అన్నివిధాలా ప్ర‌య‌త్నించాం. ఇది మేమిద్దరం తీసుకున్న నిర్ణ‌యం. కలిసి ఆనందించిన స‌మ‌యాలు.. ప‌రస్పర గౌరవం.. సాంగత్యం.. మేము ఒక కుటుంబంగా ఎదుగుతున్న‌ప్పుడు తీసుకోవాల్సిన‌ కఠిన నిర్ణయమిది'' అని నోట్ లో అత‌డు రాసాడు. మేము అగస్త్యునితో ఆశీర్వదించబడ్డాము. అతడు మా ఇద్దరి జీవితాలకు కేంద్రంగా కొనసాగుతాడు. అతడి సంతోషం కోసం మేం చేయగలిగినదంతా చేస్తాం. అతడికి మేం సహ-తల్లిదండ్రులుగా ఉంటాము. ఈ కష్టమైన సున్నితమైన సమయంలో మాకు గోప్యతను అందించాల‌ని.. మీ మద్దతు, అవగాహనను.. మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము'' అని పాండ్యా రాశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా ఎడిషన్ ప్రారంభ దశలోనే ఈ జంట విడాకుల గురించిన పుకార్లు మొదట వెలువడ్డాయి. నటాషా తన ఇన్‌స్టా నుంచి 'పాండ్య' ఇంటిపేరును తొలగించి, వారి ఫోటోలను తొలగించడంతో ఊహాగానాలు చెలరేగాయి. నటాషా తమ కుమారుడు అగస్త్యతో కలిసి ముంబై నుంచి తన స్వదేశమైన సెర్బియాకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉండగా శ్రీలంక పర్యటనకు బీసీసీఐ జట్టును ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. T20 ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మకు డిప్యూటీగా ఉన్న హార్దిక్, T20I జట్టులో భాగంగా ఉన్నాడు కానీ వైస్ కెప్టెన్సీ స్థానం నుండి తొలగించబడ్డాడు. ఆ పాత్రను వర్ధమాన నటుడు శుభ్‌మన్ గిల్‌కి అప్పగించారు. వ్య‌క్తిగత కారణాల వల్ల 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆడ‌లేన‌నే అతని అభ్యర్థనను బీసీసీఐ ఆమోదించినందున హార్దిక్ వన్డే సిరీస్‌లో భాగం కావడం లేదు.