అతడి ఆస్తుల రేంజ్ అది..లేక్క తేలిందిలా!
అయితే ఆస్తులన్ని పాండ్యా తన తల్లి పేరిట గతంలోనే మార్చేసాడని ప్రచారం సాగింది. అవన్ని పక్కనబెడితే అసలు హార్దిక్ పాండ్యా ఆస్తులు ఎంతంటే? ఆ వివరాల్లోకి వెళ్లాల్సిందే.
By: Tupaki Desk | 20 July 2024 12:30 PM GMTఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిచ్ విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతో విడిపోయినట్లు పాండ్యా వెల్లడించాడు. భార్యాభర్తలుగా విడిపోయినా తల్లిదండ్రులుగా కుమారుడి బాధ్యతలు నెరవేరుస్తామని తెలిపాడు. ఈ నేపథ్యంలో పాండ్యా ఆస్తుల్లో నటాషా కి ఎంత వాటా దక్కుతుంది? అన్న చర్చ తెరపైకి వస్తోంది.
అసలు హార్దిక్ పాండ్యా ఆస్తులు ఎంతంటే? ఆ వివరాల్లోకి వెళ్లాల్సిందే. హార్దిక్ పాండ్యా నికర విలువ 11.4 మిలియన్లు అంటే దాదాపు రూ. 94 కోట్లు. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్యా ఐపీఎల్ నుంచి సుమారు 74.3 కోట్లు సంపాదించాడని రిపోర్టులు చెబుతున్నాయి.
బరోడాలో రూ. 3.1 కోట్ల విలువైన పెంటా హౌస్, బాంద్రాలో రూ. 30 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ ఉంది. అలాగే బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా భారీ మొత్తంలో కూడబెడుతున్నాడు. పాండ్యా గల్ఫ్ ఆయిల్, స్టార్ స్పోర్ట్స్, జిల్లెట్, బోట్, డ్రీమ్ 11, అమెజాన్, ఒప్పోతో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లను కలిగి ఉన్నాడు. ఒక్కో బ్రాండెడ్ ఎండార్స్‌మెంట్‌కు కోటి రూపాయలు తీసుకుంటున్నాడు.
మెర్సిడెస్ ఏఎమ్ జీజీ 63, ఆడీ ఏA6, జీప్ క్యాంపస్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్లు కూడా హార్దిక్ పాండ్యా గ్యారేజీలో ఉన్నాయి. అలాగే నటాషా సంపద 20 కోట్లు అని సమాచారం. భారతీయ చట్టాల ప్రకారం విడాకుల పరిష్కారంలో హార్దిక్ పాండ్యా తన నికర విలువలో 70% కోల్పోబోతున్నారని ఇప్పటికే ప్రచారంలో ఉంది. మరి మ్యూచివల్ అండర్ స్టాండింగ్ మీద విడిపోయిన జోడీ మధ్య చట్ట పరంగా ఎలాంటి ఒప్పందం కుదిరిందన్నది తెలియాలి. ఇటీవలే నటాషా ఇండియా విడిచి సెర్బియాకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.