Begin typing your search above and press return to search.

భార్య‌తో బ్రేక‌ప్ పుకార్లు.. ఇంత‌లోనే హీరోయిన్‌తో?

అన‌న్య ప్ర‌స్తుతం ఒంట‌రి.. ఇప్ప‌టికే ఒంట‌రి అయిన హార్థిక్ తో మింగిల్ అవుతోంది! అంటూ సోష‌ల్ మీడియాల్లో బోలెడంత రాద్ధాంతం జ‌రుగుతోంది.

By:  Tupaki Desk   |   16 July 2024 3:18 PM GMT
భార్య‌తో బ్రేక‌ప్ పుకార్లు.. ఇంత‌లోనే హీరోయిన్‌తో?
X

టీమిండియా క్రికెట‌ర్ హార్థిక్ పాండ్యా తన భార్య న‌టాషా స్టాంకోవిక్ నుంచి విడిపోయాడంటూ పుకార్లు షికార్ చేసాయి. ఆ ఇద్ద‌రి న‌డుమా ఏదీ స‌రిగా లేదు. అందువ‌ల్ల న‌టాషా అత‌డి నుంచి దూరంగా ఉంటోంది. అనూహ్యంగా సోష‌ల్ మీడియాల్లోను బ్రేక‌ప్ అయ్యారు. క‌లిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేసారు. సామాజిక మాధ్య‌మాల్లో ఒక‌రినొక‌రు అనుస‌రించడం లేదని రెడిట్ గూఢ‌చారులు క‌థ‌నాలు అల్లారు. ప్ర‌తిష్ఠాత్మ‌క టి-20 వ‌ర‌ల్డ్ క‌ప్ ని గెలిచిన ఆనందాన్ని కూడా పాండ్యా త‌న భార్యతో షేర్ చేసుకునే అవ‌కాశం లేకుండా పోయింద‌ని అభిమానులు వాపోయారు.

మీడియాలో ఇన్ని పుకార్లు వ‌చ్చాక కూడా న‌టాషా నుంచి రిప్ల‌య్ లేదు. హార్థిక్ తో విభేధాలున్నాయ‌ని తెలియ‌జేసే సందేశాల‌ను సోష‌ల్ మీడియాల్లో పోస్ట్ చేసి న‌టాషా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. హార్థిక్ ఆస్తుల్లో ఆమె షేర్ గురించి కూడా నెటిజ‌నులు చ‌ర్చించారు. ఇదిలా ఉంటే, భార్య‌తో బ్రేక‌ప్ అయిన హార్థిక్ మొన్న అనంత్ అంబానీ- రాధిక మ‌ర్చంట్ పెళ్లి వేడుక‌లో ప్ర‌ముఖ బాలీవుడ్ యువ‌హీరోయిన్ అన‌న్య పాండేతో స‌న్నిహితంగా క‌లిసి మెలిసి ఉండ‌టం, డ్యాన్సులు చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. అన‌న్య అత‌డితో సింక్ అయ్యి డ్యాన్సులు చేస్తున్న ఫోటోలు వీడియోలు వెబ్ లో సునామీ స్పీడ్ తో దూసుకెళ్లాయి.

ఇటీవ‌లే త‌న ప్రియుడు ఆదిత్య రాయ్ క‌పూర్ నుంచి విడిపోయిన అన‌న్య పాండే ఇంత‌లోనే హార్థిక్ పాండ్యాకు స‌న్నిహితంగా మారిందంటూ చాలా మంది నెటిజ‌నులు ఊహాగానాలు సాగించారు. అన‌న్య ప్ర‌స్తుతం ఒంట‌రి.. ఇప్ప‌టికే ఒంట‌రి అయిన హార్థిక్ తో మింగిల్ అవుతోంది! అంటూ సోష‌ల్ మీడియాల్లో బోలెడంత రాద్ధాంతం జ‌రుగుతోంది. అంబానీ పెళ్లి ఒక కొత్త జంట‌ను ప‌రిచ‌యం చేసిందంటూ పంచ్ లు విసురుతున్నారు యువ‌జ‌నం.

ఓవ‌రాల్ గా ఆ ఇద్ద‌రి లైఫ్ లో ఏం జ‌రుగుతోందో మ‌రింత క్లారిటీ రావాల్సి ఉంద‌ని కూడా కొంద‌రు ఎక్స్ ఖాతాలో రాస్తున్నారు. ఇప్ప‌టికి ఇవ‌న్నీ పుకార్లు మాత్ర‌మే.. ఆ ఇద్ద‌రి న‌డుమా ఏం ఉంది? అన్న‌దానిపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఆదిత్య‌, అన‌న్య ప్ర‌స్తుతం ఎవ‌రికి వారు కెరీర్ ప‌రంగా బిజీ గా ఉన్నారు.