కోలీవుడ్ సినీ లవర్స్ కు కష్టకాలం
ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయిన ఉదయం తొమ్మిది గంటల నుంచి థియేటర్స్ లో షోలు వేయాలి. మార్నింగ్, బెన్ ఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వడం లేదు.
By: Tupaki Desk | 10 Nov 2023 7:45 AM GMTకోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు పాన్ ఇండియా బ్రాండ్ తోనే ఐదు భాషలలో రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీ మార్కెట్ వచ్చిన తర్వాత వీలైనన్ని ఎక్కువ భాషలలో సినిమాలని ప్రేక్షకులకి అందించే ప్రయత్నం చేస్తున్నారు. షూటింగ్ ఒక వెర్షన్ లోనే చేసిన పోస్ట్ ప్రొడక్షన్ లో క్వాలిటీ డబ్బింగ్ తో ఇతర భాషలలో అందిస్తున్నారు. ఇలాంటి సినిమాలకి డిజిటల్ ఛానల్స్ నుంచి రైట్స్ రూపంలో ఎక్కువ ఆదాయం దొరుకుతోంది.
అలాగే తమిళ్ స్టార్స్ కూడా తమ సినిమాలని పాన్ ఇండియా బ్రాండ్ తో అన్ని ప్రాంతీయ భాషలలో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఆ సినిమాలు ఇతర భాషలలో ముందుగా రిలీజ్ అవుతున్నాయి. అన్ని చోట్ల రిలీజ్ అయిన తర్వాత తమిళనాట థియేటర్స్ లో ప్రదర్శనకి వస్తోంది. తాజాగా కార్తి జపాన్ మూవీ బెంగళూరులో ఉదయం ఏడు గంటలకి ఫస్ట్ షో పడింది. తరువాత హైదరాబాద్ లో షో ప్రారంభం అయ్యింది.
ఉదయం తొమ్మిది గంటలకి తమిళనాట చెన్నైలో షోలు ప్రారంభం అయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం సినిమాల రిలీజ్ విషయంలో కీలక ఉత్తర్వులు అమల్లోకి తీసుకొచ్చాయి. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయిన ఉదయం తొమ్మిది గంటల నుంచి థియేటర్స్ లో షోలు వేయాలి. మార్నింగ్, బెన్ ఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వడం లేదు. అలాగే అదనపు షోలకి కూడా అనుమతులు పూర్తిగా రద్దు చేశారు.
అజిత్ తునివు మూవీ రిలీజ్ సమయంలో ఉదయం ఫ్లెక్సీ కడుతూ ఒక అభిమాని చనిపోయాడు. దీంతో ప్రభుత్వం సినిమాల రిలీజ్ విషయంలో మార్గదర్శకాలు తీసుకొచ్చాయి. విజయ్ లియో సినిమాకి కూడా ఇదే రూల్ అమలు చేసింది. ఆ చిత్ర నిర్మాత హైకోర్టుకి వెళ్ళిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తొమ్మిది గంటలకి మొదటి షో ప్రారంభించారు.
అయితే అంతకంటే ముందుగానే ఓవర్సీస్ తో పాటు ఇతర రాష్ట్రాలలో లియో మూవీ షోలు పడిపోయాయి. ఫైనల్ గా తమిళనాడులో పడింది. ఈ పద్ధతి భవిష్యత్తులో రిలీజ్ కాబోయే సినిమాలకి కూడా అమలులో ఉండనుంది. దీనిపై స్టార్ హీరోల అభిమానులు మాత్రం పెదవివిరుస్తున్నారు. అయితే తటస్థ ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది.