ప్రోమో: వీరమల్లు సర్ ప్రైజ్.. పవన్ ఫ్యాన్స్ కు సంక్రాంతి కిక్
సంక్రాంతి పండగ సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమానులకు భారీ గిఫ్ట్‌గా హరి హర వీరమల్లు చిత్రం నుంచి తొలి పాట ప్రోమో విడుదలైంది.
By: Tupaki Desk | 14 Jan 2025 10:20 AM GMTసంక్రాంతి పండగ సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమానులకు భారీ గిఫ్ట్‌గా హరి హర వీరమల్లు చిత్రం నుంచి తొలి పాట ప్రోమో విడుదలైంది. ‘‘మాట వినాలి’’ అంటూ సాగే ఈ పాట ప్రోమో, పవన్ స్వరంతో వినిపించనున్న ఈ పాట ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా చాలా కాలంగా సెట్స్ పై ఉన్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.
‘‘వీరమల్లు మాట చెబితే వినాలి’’ అంటూ ప్రారంభమవుతున్న ప్రోమో, పవర్‌ఫుల్ బీట్‌లతో ఆసక్తిని కలిగిస్తోంది. ప్రోమోలో పవన్ చెప్పిన డైలాగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే, పాటలో జానపద టచ్‌తో పాటు పవర్‌పుల్ ఎమోషన్స్ కూడా పుష్కలంగా ఉంటాయని అర్థమవుతోంది. ఈ ప్రోమోకు ఎంఎం కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించడం మరో ప్రధాన ఆకర్షణ.
జనవరి 17వ తేదీ ఉదయం 10 గంటల 20 నిమిషాలకు ఈ పాట ఫుల్ వీడియోను విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ వెల్లడించింది. ఈ పాటకు సంబంధించి జనవరి 6న ఓ అప్‌డేట్ ఇచ్చినప్పటికీ, అనివార్య కారణాలతో అప్పట్లో వాయిదా పడింది. ఇప్పుడు సంక్రాంతి సందర్బంగా ప్రోమో విడుదల చేసి, అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేశారు.
హరి హర వీరమల్లు పీరియాడిక్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొఘలుల కాలం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో పవన్ ఓ బందిపోటు పాత్రలో కనిపించనున్నారు. సినిమా షూటింగ్ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వస్తున్నప్పటికీ, ఇప్పుడు షూటింగ్ దాదాపు పూర్తి అయ్యిందని టీమ్ పేర్కొంది. ఈ సినిమా మార్చి 28న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్, అలాగే బాబీ డియోల్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోలు, టీజర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. హరి హర వీరమల్లు సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరచిన ఈ పాటలతో పాటు, సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌పై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.