పవన్ కళ్యాణ్ పాట సీక్రెట్ కి ముహూర్తం!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా పీరియాడిక్ చిత్రం `హరి హరవీరమల్లు` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 28 Jan 2025 8:45 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా పీరియాడిక్ చిత్రం `హరి హరవీరమల్లు` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పవన్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రమిది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే సినిమాలో పవన్ ఆలపించిన `మాట వినాలి` పాట రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మెలోడీ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈపాటను పవన్ కేవలం తెలుగులోనే కాదు మిగతా అన్ని భాషల్లోనూ ఆయనే ఆలపించారు.
మొత్తం ఐదు భాషల్లో పాడి శ్రోతల్ని సర్ ప్రైజ్ చేసారు. అన్ని భాషల అభిమానులకు పవన్ వాయిస్ కనెక్ట్ అయింది. అయితే ఈ పాటకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు? అసలేం జరిగింది? పవన్ పాడటానికి గల కారణాలు ఏంటి? అన్నది రివీల్ చేయడానికి మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. జనవరి 29న మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకి ఆ సాంగ్ రికార్డింగ్ మేకింగ్ వీడియో లాంచ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో అభిమానులు ఆ సమయం ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి మేకింగ్ వీడియోలో ఉన్న సీక్రెట్ ఏంటో తెలియాలి. దీన్ని బట్టి ఈ సినిమా ప్రచారం పనులు చిన్నగా మొద లైనట్లు కనిపిస్తుంది. మొన్న పాట పాడటం.. ఆ తర్వాత ఔరంగజేబు పాత్ర పోషిస్తోన్న బాబి డియోల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం తెలిసిందే. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేయడం విశేషం. మార్చి 28న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అంటే సినిమా రిలీజ్ కి ఇంకా రెండు నెలలు సమయం ఉన్నట్లు. ఈ సమయాన్ని ప్రచారానికి వినియోగించు కుంటున్నారు. షూటింగ్ ముగింపు దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ఇద్దరు దర్శకులు పనిచేస్తోన్న సంగతి తెలిసిందే. ఒకరు క్రిష్ కాగా, మరొకరు జ్యోతి కృష్ణ. అయితే ఇద్దరు వేర్వేరుగా పని చేస్తున్నారు. ప్రాజెక్ట్ నుంచి క్రిష్ ఎగ్జిట్ అయి తర్వాత జ్యోతికృష్ణ వచ్చాడు.