Begin typing your search above and press return to search.

వీర‌మ‌ల్లుకు ఆ నాలుగు రోజులు డేట్లు ఇంకా ఇవ్వ‌లేదా?

`హ‌రిహ‌ర వీర‌మల్లు` షూటింగ్ పూర్త‌యిందా? ప్ర‌స్తుతం ప‌వ‌న్ పూర్తిగా `ఓజీ` కే డేట్లు కేటాయించారా? అంటే అదిరిపోయే ట్విస్ట్ బయ‌ట ప‌డింది

By:  Tupaki Desk   |   18 Dec 2024 6:12 AM GMT
వీర‌మ‌ల్లుకు ఆ నాలుగు రోజులు డేట్లు ఇంకా ఇవ్వ‌లేదా?
X

`హ‌రిహ‌ర వీర‌మల్లు` షూటింగ్ పూర్త‌యిందా? ప్ర‌స్తుతం ప‌వ‌న్ పూర్తిగా `ఓజీ` కే డేట్లు కేటాయించారా? అంటే అదిరిపోయే ట్విస్ట్ బయ‌ట ప‌డింది. ఇంత వ‌ర‌కూ వీర‌మ‌ల్లు షూటింగ్ పూర్త‌వ్వ‌లేదు అన్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఓ 20 రోజుల క్రితం ప‌వ‌న్ క‌ళ్యాణ్ షూటింగ్ కి డేట్లు కేటాయించిన‌ట్లు...మ‌రో నాలుగు రోజులు ప‌వ‌న్ సెట్స్ కి వ‌స్తే ఆయ‌న పార్ట్ స‌హా నెలాఖ‌రుకు మొత్తం షూటింగ్ పూర్త‌వుతుంద‌ని అంతా భావించారు. కానీ టీమ్ వేసుకున్న ప్లానింగ్ ఏది జ‌ర‌గ‌లేద‌ని తాజాగా ప్రూవ్ అయింది.

తాజాగా వీర‌మ‌ల్లుకు సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వ‌చ్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈనెల 22, 23 తేదీల వ‌ర‌కూ షూట్ కి వ‌స్తే అత‌డి పార్ట్ స‌హా షూటింగ్ మొత్తం పూర్తి చేయాల‌నుకున్నారుట‌. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ బిజీ షెడ్యూల్ కార‌ణంగా షూట్ కి బ్రేక్ ప‌డింది. మ‌రి ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి? అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టి నుంచైనా షూట్ కి వ‌స్తే గ‌నుక ఈనెల‌ఖ‌రుక‌ల్లా అత‌డి పోర్ష‌న్ స‌హా షూటింగ్ మొత్తం పూర్తి చేయాల‌ని టీమ్ ప్లాన్ చేసుకుని రెడీగా ఉంది.

ఇదంతా జ‌ర‌గాలి అంటే? ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్న ప‌ళంగా వీర‌మ‌ల్లు సెట్స్ కి వెళ్లాలి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెండింగ్ షూటింగ్ పూర్తి చేస్తే మిగతా ప‌నులు చ‌క‌చ‌కా పూర్తి చేయాలని మేక‌ర్స్ సిద్దంగా ఉన్నారు.షూటింగ్ పూర్త‌యిన వ‌ర‌కూ పోస్ట్ ప్రొడ‌క్ష‌న పనులు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు పూర్తి చేస్తున్నారు. ఆ న‌మ్మ‌కంతోనే మార్చిలో రిలీజ్ తేదీ ఇవ్వ‌గ‌లిగారు. కానీ ప‌వ‌న్ పెండింగ్ పూర్తి చేయ‌డంలో జాప్యం వ‌హించ‌డంతో? వీర‌మ‌ల్లు టీమ్ లో ఇప్పుడు కంగారు మొద‌లైంది. ప్ర‌క‌టించిన తేదికి రిలీజ్ చేయ‌గ‌ల‌మా? లేదా? అన్న గుబులు క‌నిపిస్తుంది.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ థాయ్ లాండ్ లో ఉన్నారు. అక్క‌డ ఓజీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మ‌రి ఇదెలా సాధ్యం అంటే? ప‌వ‌న్ వీర‌మ‌ల్లుకు ఇచ్చిన డేట్ల‌లో అనూహ్యంగా పోలిటిక‌ల్ బిజీ ఏర్ప‌డ‌టంతో షూట్ కి హాజ‌రు కాలేక పోయిన‌ట్లు తెలుస్తోంది. కానీ `ఓజీ` విష‌యంలో ఎలాంటి రాజ‌కీయ భేటీలు లేక‌పోవ‌డంతో? ఇచ్చిన డేట్ల ప్రకారం హాజ‌రవుతున్న‌ట్లు తెలుస్తోంది. అదీ సంగ‌తి.