Begin typing your search above and press return to search.

అనుకున్నట్లే బ్లాక్ బస్టర్ డేట్ పట్టేసిన వీరమల్లు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న హరి హర వీరమల్లు సినిమా ఎట్టకేలకు కొత్త రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది.

By:  Tupaki Desk   |   14 March 2025 11:59 AM IST
అనుకున్నట్లే బ్లాక్ బస్టర్ డేట్ పట్టేసిన వీరమల్లు!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న హరి హర వీరమల్లు సినిమా ఎట్టకేలకు కొత్త రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. ఈ సినిమా ఆలస్యంపై గత కొన్ని నెలలుగా అనేక రకాల ఊహాగానాలు వినిపించినా, ఎప్పుడెప్పుడు థియేటర్లలో వీరమల్లును చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అసలైతే మార్చి 28న విడుదల కావాల్సిన ఈ సినిమా పనులు అనుకున్నట్లు పూర్తి కాకపోవడంతో వాయిదా వేయనున్నట్లు టాక్ వచ్చింది.


మార్చి 28న, అదే రోజు నితిన్ రాబిన్ హుడ్ విడుదలకు సిద్ధమవడంతో రెండు సినిమాల మధ్య క్లాష్ ఏర్పడుతుందని భావించారు. పైగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ MAD స్క్వేర్ సినిమాను కూడా అదే రోజుకు ఫిక్స్ చేయడంతో మరింత రసవత్తరమైన పరిస్థితి ఏర్పడింది. కానీ, వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికావలసి ఉండటంతో నిర్మాతలు సరైన సమయాన్ని ఎంచుకుని మే 9న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇంకా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను పూర్తి చేయాల్సి ఉంది. ముఖ్యంగా గ్రాఫిక్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. దీంతో హడావుడిగా సినిమాను థియేటర్లకు తీసుకురావడం కరెక్ట్ కాదని అనుకున్నారు. వాయిదా వేసినా కూడా, మే 9న ఈ సినిమా థియేటర్లలోకి రావడం మరింత మంచి పరిణామమే అని అభిమానులు భావిస్తున్నారు. గతంలో విశ్వంభర సినిమా కూడా అదే తేదీకి ప్లాన్ చేయగా, ఇప్పుడు ఆ డేట్‌ను హరి హర వీరమల్లు తీసేసినట్టైంది.

మే 9న గతంలో బిగ్ హిట్స్ విడుదలైన విషయం తెలిసిందే. జగదేక వీరుడు అతిలోక సుందరి, ప్రేమించుకుందం రా, మహానటి, మహర్షి లాంటి హిట్ సినిమాలు ఇదే డేట్ కు వచ్చాయి. పర్ఫెక్ట్ సమ్మర్ హాలిడేస్ సీజన్ కావడంతో మేకర్స్ ఈ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ క్లారిటీతో మెగాస్టార్ విశ్వంభర రావడం లేదని క్లారిటీ వచ్చేసింది.

ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెద్దగా పెరగలేదు. కేవలం పవన్ ఇమేజ్ తప్ప సరైన కంటెంట్ తో ఎట్రాక్ట్ చేసింది లేదు. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ చారిత్రక యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు జ్యోతిక్రిష్ణ ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. సినిమాకు ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, ఎ.ఎం. రత్నం ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.