Begin typing your search above and press return to search.

వీరమల్లు అగ్ని బాణాలు.. స్టన్నింగ్ లుక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లుపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   13 Oct 2024 12:32 PM IST
వీరమల్లు అగ్ని బాణాలు.. స్టన్నింగ్ లుక్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లుపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. విడుదల విషయంలో జాప్యం జరుగుతున్నా కూడా మేకర్స్ ఇస్తున్న అప్డేట్స్ తో సినిమాపై బజ్ అస్సలు తగ్గడం లేదు. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఒక చారిత్రక యోధుడి పాత్రను పోషిస్తున్నారు. హరిహర వీరమల్లు అనే పేరుకు తగ్గట్టుగా, ఈ సినిమా సామ్రాజ్యవాదులు మరియు వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఒక సామాన్యుడు చేసిన అలుపెరగని పోరాటాన్ని చూపుతుంది.


ఇక సినిమాలో ఒక వార్ ఎపిసోడ్ ను హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ సారధ్యంలో చిత్రీకరించారు, ఇందులో 400 - 500 మంది ఆర్టిస్టులు పాల్గొన్నారు. సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, అక్టోబరు 14 నుంచి సినిమా కొత్త షెడ్యూల్ మొదలవుతోంది, మరియు నవంబర్ 10 నాటికి పూర్తిస్థాయి షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ యోచిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టు 2025 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.

ఇక లేటెస్ట్ గా మేకర్స్ స్పెషల్ స్టిల్ విడుదల చేశారు. ఈ స్టిల్ చూసిన అభిమానులంతా రివల్యూషనరీ యోధుడిని చూసినట్లుగా భావిస్తున్నారు. ఫోటోలో పవన్ కళ్యాణ్ తన చేతిలో వున్న విల్లు నుండి మూడు అగ్నితో కూడిన భాణాలను విసురుతూ దృఢంగా నిలబడ్డారు. ఈ స్టిల్‌ పవన్ కళ్యాణ్ అభిమానులలో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.

ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఏమిటంటే, పవన్ కళ్యాణ్ స్వయంగా ఒక పాటను ఆలపించారు. తెలుగులో ఈ పాటను ఆయన పాడగా, ఇతర భాషలలో ఇతర ప్రముఖ గాయకులు పాడారు. ఇది పవన్ అభిమానులకు ఒక అదనపు ట్రీట్‌గా నిలవనుందట. మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి సమకూరుస్తున్న ఈ సంగీతం ప్రపంచస్థాయి ప్రమాణాలను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

హరిహర వీరమల్లు కథాంశం సామ్రాజ్యవాదుల పాలన మరియు వారి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే ఒక యోధుడి చుట్టూ తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో సామాన్యుడి పాత్రలో ఉండి, అతని పరాక్రమాన్ని మలచిన యోధుడిగా మారతాడు. తన యుద్ధతత్వం మరియు చతురతతో ఆయన ఏ విధంగా తన గమ్యాన్ని చేరుకుంటాడన్నది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న ప్రధాన కథాంశం. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో అనుపమ్ ఖేర్, కోట శ్రీనివాసరావు, మురళీ శర్మ తదితరులు కనిపించనున్నారు.