Begin typing your search above and press return to search.

వీరమల్లు.. అసలు పవన్ ఏమన్నారంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఈ మూడు కూడా షూటింగ్ స్టేజ్ లోనే ఉండటం విశేషం

By:  Tupaki Desk   |   31 May 2024 5:29 AM GMT
వీరమల్లు.. అసలు పవన్ ఏమన్నారంటే..
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఈ మూడు కూడా షూటింగ్ స్టేజ్ లోనే ఉండటం విశేషం. అందులో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా, ఒకటి కమర్షియల్ మూవీగా రెడీ అవుతున్నాయి. సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ ముంబై గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యింది. సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత వీలైనంత వేగంగా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయాలని సుజిత్ ప్లాన్ చేసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా కాల్ షీట్స్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మరో వైపు పీరియాడిక్ జోనర్ లో హిస్టారికల్ కథతో రెడీ అవుతోన్న హరిహరవీరమల్లు చిత్రాన్ని పవన్ కళ్యాణ్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యాడనే ప్రచారం నడుస్తోంది.

తాజాగా నిర్మాత ఏఎం రత్నం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. క్రిష్ ఈ మూవీ నుంచి తప్పుకున్నారని, మిగిలిన భాగం తన తనయుడు జ్యోతికృష్ణ కంప్లీట్ చేస్తారని క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అన్నారు. షూటింగ్ కి రెడీ కమ్మని పవన్ కళ్యాణ్ నిర్మాతకి చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.

ఎన్నికల రిజల్ట్ తర్వాత ఎప్పుడు పాల్గొనేది చెబుతానని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారంట. అందుకే ఏఎం రత్నం ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఒక 25 రోజులు పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ ఇస్తే సరిపోతుందంట. కేవలం అతనికి సంబందించిన సన్నివేశాలు మాత్రమే ఇంకా కంప్లీట్ చేయాల్సి ఉందని, మిగిలిన పార్ట్ మొత్తం పూర్తయ్యిందని ఏఎం రత్నం చెప్పారు.

మరో వైపు ఓజీ మూవీ ఈ ఏడాదిలో రిలీజ్ కావడం కష్టం అనే మాట వినిపిస్తోంది. రీసెంట్ గా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న లక్కీ భాస్కర్ మూవీని సెప్టెంబర్ లో రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రాదని క్లారిటీ వచ్చాక ఈ డేట్ ఫిక్స్ చేసినట్లు నాగవంశీ చెప్పారు. ఆయన సినిమా వస్తే మా మూవీ వచ్చినట్లే అని, ఓజీతో పోటీ పడటం ఉండదని చెప్పారు.

ఈ మాటల కారణంగా ఓజీ మూవీ రిలీజ్ వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ తెరపైకి వచ్చింది. దీనిని నిర్మాత డివివి దానయ్య, సుజిత్ ఏమైనా క్లారిటీ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. పవర్ స్టార్ అభిమానులు మాత్రం హరిహరవీరమల్లు కంటే ఓజీ మూవీ ముందుగా రావాలని కోరుకుంటున్నారు.