Begin typing your search above and press return to search.

హీరోకి ఒకటే.. కానీ నిర్మాతకు రెండు సినిమాల లెక్క..!?

ఈమధ్య పవన్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల సినిమా మరింత లేట్ అవుతూ వస్తుంది. ఒక్క సినిమా కోసం ఇన్నేళ్లు వెయిట్ చేయడం తన వల్ల కాదని క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చాడు.

By:  Tupaki Desk   |   15 July 2024 4:31 PM GMT
హీరోకి ఒకటే.. కానీ నిర్మాతకు రెండు సినిమాల లెక్క..!?
X

పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో దాదాపు నాలుగేళ్ల క్రితం సెట్స్ మీదకు వెళ్లిన సినిమా హరి హర వీరమల్లు. పీరియాడికల్ డ్రామాగా రాబోతున్న సినిమా గురించి మొదట్లో మంచి బజ్ ఉండేది. పవన్ నుంచి డిఫరెంట్ అటెంప్ట్ గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు. అయితే రాను రాను సినిమా పట్ల ఆసక్తి తగ్గింది. ఒకానొక దశలో సినిమా క్యాన్సిల్ అయితే బాగుండని కూడా అనుకున్నారు. కానీ ఏ.ఎం రత్నం వెయిట్ చేసి మరీ సినిమా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు.

ఈమధ్య పవన్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల సినిమా మరింత లేట్ అవుతూ వస్తుంది. ఒక్క సినిమా కోసం ఇన్నేళ్లు వెయిట్ చేయడం తన వల్ల కాదని క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చాడు. క్రిష్ ప్లేస్ లో జ్యోతి కృష్ణ కు డైరెక్షన్ బాధ్యతలు అప్పగించారు. ఐతే ఈమధ్యనే ఈ సినిమాను రెండు భాగాలుగా అని ప్రకటించారు. అసలు ఆశలే వదులుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ సినిమా రెండు భాగాలు అనేసరికి ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

హరి హర వీరమల్లు సినిమా ముందు ఒక భాగంగానే అనుకున్నారు క్రిష్ బయటకు వెళ్లడం సినిమా నాలుగేళ్లుగా సెట్స్ మీద ఉండటం వల్ల నిర్మాణ ఖర్చు పెరగడం వల్ల సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తే నిర్మాత పెట్టింది రాబట్టుకోవచ్చనే ఆలోచనతో వీరమల్లుని రెండు పార్ట్స్ గా ప్లాన్ చేస్తున్నారట. కానీ పవన్ మాత్రం దీన్ని ఒక సినిమాగానే లెక్క కడుతున్నారని తెలుస్తుంది.

పవన్ కి సంబందించిన పోర్షన్ అంతా పూర్తి చేసి దాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ వీరమల్లు ఒక సినిమాలానే చూస్తుండగా నిర్మాత మాత్రం రెండు భాగాలుగా చేసి లాభాలు గడించాలని చూస్తున్నారు. ఐతే ఈ మధ్య సినిమాలకు సీక్వెల్స్ కామన్ అయ్యాయి ముఖ్యంగా బడ్జెట్ ఎక్కువైన ప్రతి సినిమా రెండు భాగాలుగా చేస్తున్నారు. ఐతే అలా చేసిన సినిమాలు మొదటి భాగం హిట్ అయితేనే రెండో భాగానికి మార్కెట్ ఉంటుంది. మరి ఈ విషయంలో వీరమల్లు మేకర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నది తెలియాల్సి ఉంది.