Begin typing your search above and press return to search.

ఆ పాత్రను చేసినందుకు ఆమెపై బూతులు..!

ఒకప్పుడు సీరియల్స్ చూస్తూ పెద్ద వారు అందులో విలన్స్ గా నటించిన నటిని లేదా నటుడిని తిడుతూ ఉండటం మనం చూసే ఉంటాం.

By:  Tupaki Desk   |   11 April 2024 3:30 PM GMT
ఆ పాత్రను చేసినందుకు ఆమెపై బూతులు..!
X

ఒకప్పుడు సీరియల్స్ చూస్తూ పెద్ద వారు అందులో విలన్స్ గా నటించిన నటిని లేదా నటుడిని తిడుతూ ఉండటం మనం చూసే ఉంటాం. ముఖ్యంగా లేడీ విలన్‌ గా కనిపించిన వారిపై మన పెద్దొళ్లు చాలా గట్టిగానే తిట్ల వర్షం కురిపించడం జరిగింది. అయితే ఇప్పుడు సోషల్‌ మీడియా ట్రెండ్ నడుస్తోంది.

సినిమాల్లో నటించిన నటీ నటులకు సోషల్ మీడియా లో ట్రోల్స్ తప్పడం లేదు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసినా లేదంటే సినిమాలో సరిగా నటించకున్నా కూడా విమర్శలు ఓ రేంజ్ లో వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో చాలా మంది నటీ నటులు ట్రోల్స్ కి గురి అవుతున్నారు.

తాజాగా ట్రూ లవర్‌ అనే సినిమా వచ్చింది. థియేట్రికల్‌ రిలీజ్ అయ్యి పాజిటివ్‌ టాక్ ను దక్కించుకుని, ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్‌ అవుతున్న ట్రూ లవర్‌ సినిమాలో హీరోయిన్‌ కి స్నేహితురాలు అయిన ఐషూ గా హరిణి సౌందర్‌ రాజన్‌ నటించారు. హీరో, హీరోయిన్‌ ప్రేమ విషయంలో ఐషూ పాత్ర ఇన్వాల్వ్‌ అవ్వుతూ ఉంటుంది.

తాజాగా హరిణి సౌందర్ రాజన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఐషూ పాత్ర చేసినందుకు గాను తాను ఎంతగా విమర్శలు ఎదుర్కొన్నాను అనేది చెప్పుకొచ్చింది. ట్రూ లవర్ లో నేను పోషించిన పాత్రను విమర్శిస్తూ చాలా మంది నాకు తిడుతూ మెసేజ్ లు చేశారు.

నటీనటుల నటన నచ్చక పోతే కొందరు వ్యక్తిగతంగా మాటల దాడికి సిద్ధం అవుతారు. ఆ సమయంలో వారు పోషించిన పాత్ర అని, దానికి వారి వ్యక్తిగతంతో సంబంధం ఉండదు అనే విషయాన్ని వారు మర్చి పోతారు. ఇలాంటి వారి విమర్శల వల్లే చాలా మంది అమ్మాయిలు ఐషూ లాగా మారి పోతూ ఉంటారు.

అవతలి వారి గురించి అగౌరవంగా మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్‌ కాదు. సినిమాలో ఎలా కనిపించినా కూడా విమర్శలు చేయకూడదు అని, అది కూడా వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది అస్సలు కరెక్ట్‌ కాదు అన్నట్లుగా హరిణి అభిప్రాయం వ్యక్తం చేసింది.