Begin typing your search above and press return to search.

ర‌క్తి నుంచి భ‌క్తి..వ్వాటే ప్లానింగ్ స‌ర్ జీ!

ర‌క్తి నుంచి భ‌క్తి వైపు కొత్త ప్ర‌యాణం మొద‌లు పెట్టింది.

By:  Tupaki Desk   |   27 Jun 2024 10:30 AM GMT
ర‌క్తి నుంచి భ‌క్తి..వ్వాటే ప్లానింగ్ స‌ర్ జీ!
X

దేశంలో ఓటీటీల మ‌ధ్య పోటీ ఎలా ఉంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. పోటీ ప్ర‌పంచంలో కంటెంట్ ని అందించ‌డం కోసం స‌ద‌రు సంస్థ‌లు ఎన్నో వ్యూహా ప్ర‌తివ్యూహాల‌తో ముందుకెళ్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, జియో వంటివి ఇప్ప‌టికే ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఓటీటీల్లో హారర్, క్రైమ్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, కామెడీ, యాక్షన్ ఇలా వివిధ రకాల జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీసులు అందుబాటులో ఉంటున్నాయి.

వీటితో పాటు అడల్ట్ కంటెంట్ మాత్రమే ప్రసారం చేసే ఒకే ఒక్క ఓటీటీ సంస్థ 'ఉల్లు` కూడా సుప‌రిచిమ‌తే. ఇందులో అఫైర్స్, శృంగారం అంటూ వేరే కాన్సెప్ట్ క‌థ‌లు న‌డుస్తుంటాయి. అడ‌ల్ట్ కంటెంట్ అందించ డంలో ఉల్లు ఓ బ్రాండ్ గా మారిపోయింది. ఇప్పుడిదే సంస్థ సంచ‌ల‌న నిర్ణ‌యంతో ముందుకొచ్చింది. ర‌క్తి నుంచి భ‌క్తి వైపు కొత్త ప్ర‌యాణం మొద‌లు పెట్టింది. భ‌క్తిని మాత్ర‌మే హైలైట్ చేస్తూ 'హ‌రి ఓం` పెరిట‌ సరికొత్త డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చారు.

ఇందులో కేవ‌లం డివోష‌న‌ల్ కంటెంట్ మాత్ర‌మే ఉంటుందని 'ఉల్లు` ఓటీటీ అధినేత విభు అగర్వాల్ తెలిపారు. హ‌రి ఓం స‌బ్ స్క్రిప్ష‌న్ కేవ‌లం 36 రూపాలు మాత్ర‌మే. ఈ ఓటీటీలో భారతీయ పురాణాలు, సంప్రదాయాలు, గుళ్లు, గోపురాలు, దైవ సన్నిధి క్షేత్రాలకు సంబంధిం చిన కంటెంట్‌ను అందిస్తుంది. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతపై యూత్ ఆడియెన్స్‌లో ఆసక్తి పెరుగుతున్న క్రమంలో వారిని ఆకట్టుకునేలా ఈ ఓటీటీని రూపొందిస్తున్నట్లు అధినేత తెలిపారు.

భారతీయ సాంప్రదాయాలను అన్వేషించే గేట్ వేగా ఈ హరి ఓం ఓటీటీ ఉపయోగపడుతుందన్నారు. పిల్లల కోసం ప్ర‌త్యేకంగా పౌరాణికాలకు సంబంధించిన క్యూరేటెడ్ యానిమేటెడ్ కంటెంట్‌ను కూడా హరి ఓం అందిస్తుంది.