ఒకే ప్రేమ్ లో భర్తతో హరిప్రియ ఛాన్సుందా!
గత ఏడాది వశిష్టని వివాహం చేసుకుంది. ఆ తర్వాత మరో భాషలో సినిమాలకు పూర్తిగా దూరమైంది.
By: Tupaki Desk | 16 Oct 2024 8:30 PM GMTఅందాల హరిప్రియ గురించి పరిచయం అవసరం లేదు. అమ్మడు కన్నడ నటి అయినా? ఆమె బ్యూటీకి ఎంతో మంది తెలుగు అభిమానులున్నారు. `తకిట తకిట`తో టాలీవుడ్ లో లాంచ్ అయిన అమ్మడు అటుపై `పిల్ల జమీందార్` సక్సెస్ తో మరింత ఫేమస్ అయింది. అచ్చమైన తెలుగమ్మాయి సింధు పాత్రలో అందం, అభినయంతో మెప్పించింది. దీంతో అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి.
‘అబ్బాయి క్లాస్- అమ్మాయి మాస్’, ‘ఈ వర్షం సాక్షిగా’, ‘జై సింహా’ వంటి చిత్రాల్లో నటించింది. కానీ వీటి రిలీజ్ తర్వాత అమ్మడు ఒక్కసారిగా కనుమరుగైంది. ఈ సినిమాలేవి సరిగ్గా ఆడలేదు. దీంతో మళ్లీ మాతృభాష కన్నడలోనే బిజీ అయింది. సరిగ్గా ఇదే సమయంలో కన్నడ నటుడు విశిష్టతో ప్రేమలో పడింది. గత ఏడాది వశిష్టని వివాహం చేసుకుంది. ఆ తర్వాత మరో భాషలో సినిమాలకు పూర్తిగా దూరమైంది.
భర్త వశిష్ట తెలుగు ఆడియన్స్ కి సుపరిచితమే. వెంకటేష్ హీరోగా నటించిన ‘నారప్ప’ తో లాంచ్ అయ్యాడు. అటుపై `నయీం డైరీస్`, `ఓదెల రైల్వేస్టేషన్`,` డెవిల్`,` `ఏవమ్` లాంటి చిత్రాల్లో ప్రతినా యకుడి పాత్రల్లో నటించాడు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరు కన్నడలోనే బిజీగా ఉన్నారు. అయితే ఇద్దరు కలిసి సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఒకే ప్రేమ్ లో భార్యాభర్తల్ని చూసి ఆస్వాదించాలన్నది అభిమానుల కోరిక. మరి ఆ ఛాన్స్ వస్తుందా? లేదా? అన్నది చూడాలి. సోషల్ మీడియా వేదికగా మాత్రం చాలా ఆసక్తి చూపిస్తున్నారు. హరిప్రియ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు. సినిమా అప్ డేట్స్...అప్పుడప్పుడు కొన్ని ఫోటో షూట్లు అప్ డేట్ చేస్తుంటుంది.