అనిల్ గురించి హరీష్ మాటల్లో !
ఈ ఈవెంట్ కు హాజరైన హరీష్ శంకర్ అనిల్ రావిపూడిని ఓ రేంజ్ లో పొగిడేశారు. అనిల్ ను మొదట 2014 లో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్ లో కలిశానని, దిల్ రాజు ఆఫీస్ కు అనిల్ రావడం అదే మొదటిసారి అని తెలిపాడు.
By: Tupaki Desk | 11 Feb 2025 3:48 AM GMTవిక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాలో వెంకీ సరసన ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.
జనవరి 14న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా అందరినీ మెచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అత్యథిక కలెక్షన్ సాధించిన మొదటి తెలుగు రీజనల్ సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా రికార్డు కూడా సృష్టించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విక్టరీ వేడుకను నిర్వహించి అందరికీ షీల్డ్‌లను బహుకరించింది. ఈ ఈవెంట్ కు రాఘవేంద్ర రావు చీఫ్ గెస్టుగా హాజరవగా, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, వశిష్ట అతిథులుగా వచ్చారు.
ఈ ఈవెంట్ కు హాజరైన హరీష్ శంకర్ అనిల్ రావిపూడిని ఓ రేంజ్ లో పొగిడేశారు. అనిల్ ను మొదట 2014 లో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్ లో కలిశానని, దిల్ రాజు ఆఫీస్ కు అనిల్ రావడం అదే మొదటిసారి అని తెలిపాడు. ఆ టైమ్ లో తాను అదే బ్యానర్ లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా తీస్తున్నానని, సుప్రీమ్ కథ చెప్పడానికి అనిల్ దిల్ రాజు ఆఫీసుకొచ్చాడని చెప్పాడు.
ఆ టైమ్ లో దిల్ రాజు, అనిల్ ను పటాస్ డైరెక్టర్ ఇతనే అని తనకి పరిచయం చేశాడని చెప్పాడు హరీష్. అయితే తను అనిల్ కు కంగ్రాట్స్ చెప్పగానే పోలీస్ క్యారెక్టర్ తో ఎవరు సినిమాలు చేసినా ఆ పోలీస్ క్యారెక్టర్ కు మీరే ఇన్సిపిరేషన్ అని తనతో అన్నాడని, అలాంటి అనిల్ ఇచ్చిన సక్సెస్ ఇవాళ తనకు ఇన్సిపిరేషన్ గా మారిందని అన్నాడు హరీష్.
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎలాంటి సినిమా తీస్తే ఆడియన్స్ కు నచ్చుతుందా అని అందరూ ఆలోచిస్తున్నారని, కానీ అనిల్ అవేమీ పట్టించుకోకుండా తనకు కంఫర్ట్ అయిన జానర్ లో సినిమాను తీసి హిట్ కొడుతున్నాడని, ఎవరి స్ట్రెంగ్త్ ను వారు నమ్మితే సక్సెస్ చూడొచ్చని అనిల్ ప్రూవ్ చేశాడని, మీరు కూడా మీ మార్క్ జానర్ ను ఎప్పుడూ వదిలిపెట్టకండని సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూడగానే తనకొకరు ఫోన్ చేసి మరీ చెప్పారని హరీష్ ఈ సందర్భంగా తెలిపాడు.
ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో హిట్ అందుకున్న అనిల్, ఈసారి 'మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం' అంటున్నాడు. ఇవన్నీ చూస్తుంటే అనిల్ కు 'సంక్రాంతికే వస్తున్నాం' అనే టైటిల్ బాగా సూటవుతుందని అన్నాడు. వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబినేషన్ అందరూ ఎంతగానో ఇష్టపడే కాంబినేషన్ అని చెప్పిన హరీష్, రమణ గోగుల సాంగ్ బాగా వర్కవుటైందన్నాడు. వాస్తవానికి తన ఉస్తాద్ భగత్‌సింగ్ కోసం రమణ గోగులతో కలిసి పని చేయాల్సిందని కానీ ఆ సినిమా లేటవడంతో ఆ మంచి ఛాన్స్ ను వీళ్లు కొట్టేశారని హరీష్ అన్నాడు.