స్టార్ డైరెక్టర్ వెయిటింగ్ ఎన్నాళ్లు..?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన హరీష్ శంకర్ నెక్స్ట్ ఇయర్ తో డైరెక్టర్ గా 20 ఏళ్ల కెరీర్ ని పూర్తి చేసుకోబోతున్నారు.
By: Tupaki Desk | 6 March 2025 9:03 AM ISTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన హరీష్ శంకర్ నెక్స్ట్ ఇయర్ తో డైరెక్టర్ గా 20 ఏళ్ల కెరీర్ ని పూర్తి చేసుకోబోతున్నారు. ఐతే ఈ రెండు దశాబ్దాలలో ఆయన చేసిన సినిమాలు మాత్రం ఎనిమిది మాత్రమే. ఎప్పుడో 2019 లో గద్దలకొండ గణేష్ సినిమా తీసిన ఈ డైరెక్టర్ లాస్ట్ ఇయర్ మిస్టర్ బచ్చన్ అంటూ వచ్చాడు. ఐతే ఆ సినిమా నిరాశ పరచడంతో సైలెంట్ అయ్యాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్స్ మీద ఉంది. దళపతి విజయ్ తెరి సినిమా రీమేక్ గా ఆ సినిమా వస్తుంది. ఆ సినిమా మూల కథను మాత్రమే తీసుకుని స్క్రీన్ ప్లే పూర్తిగా మార్చేసినట్టు తెలుస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ కు రైటర్ కం డైరెక్టర్ దశరథ్ పనిచేస్తున్నారు. ఐతే పవన్ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది క్లారిటీ లేదు.
ఓ పక్క హరీష్ శంకర్ తో సినిమా చేయడానికి ఏ హీరో అంత ఆసక్తిగా లేరన్నట్టు తెలుస్తుంది. మిస్టర్ బచ్చన్ సినిమా హిట్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల హరీష్ శంకర్ తో సినిమా అంటే ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఐతే ఈ డైరెక్టర్ కి సినిమా సినిమాకు మూడు నాలుగేళ్లు గ్యాప్ కామనే కాబట్టి మళ్లీ 2027, 28లోనో వస్తాడని అనుకుంటున్నారు.
ఆమధ్య ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో హరీష్ శంకర్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఐతే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటైల్స్ మాత్రం బయటకు రాలేదు. ప్రస్తుతం హరీష్ శంకర్ ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఎలాగు ఫ్రీ గా ఉన్నాం కదా అని డైరెక్టర్ హరీష్ శంకర్ సుహాస్ హీరోగా చేస్తున్న సినిమాలో ఒక మంచి క్యామియో రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది.
హరీష్ శంకర్ మంచి ప్రతిభ గల దర్శకుడు అలాంటి డైరెక్టర్ ఇలా సినిమా సినిమాకు ఇంత గ్యాప్ తీసుకోవడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ అని చెప్పొచ్చు. ఐతే గ్యాప్ కి రీజన్స్ ఏమున్నా కూడా హరీష్ శంకర్ కాస్త సినిమాల స్పీడ్ పెంచాలని కోరుతున్నారు సినీ ప్రియులు. మరి ఆడియన్స్ రిక్వెస్ట్ ని హరీష్ శంకర్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ సినిమాను త్వరగా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.