Begin typing your search above and press return to search.

రామ్ పోతినేని.. సేఫ్ గేమ్?

ఈ మూవీ థీయాట్రికల్ బిసినెస్ లో 25 శాతం కలెక్షన్స్ కూడా రికవరీ చేయలేదంట.

By:  Tupaki Desk   |   4 Sep 2024 10:30 AM GMT
రామ్ పోతినేని.. సేఫ్ గేమ్?
X

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఆగష్టులో డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్న రామ్ కు ఊహించని షాక్ తగిలింది. డబుల్ ఇస్మార్ట్ ప్రేక్షకులని ఏ మాత్రం మెప్పించలేదు. రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ చిత్రం మారింది. ది వారియర్, స్కంద సినిమాల కంటే అతి పెద్ద ఫ్లాప్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీ నిలిచింది. ఈ మూవీ థీయాట్రికల్ బిసినెస్ లో 25 శాతం కలెక్షన్స్ కూడా రికవరీ చేయలేదంట.

డబుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్ పోతినేని పోషించిన క్యారెక్టర్ కి పూర్తి స్థాయిలో న్యాయం చేసాడు. అయితే ఈ సినిమా కథని ప్రేక్షకులకి నచ్చే విధంగా చెప్పడంలో పూరి జగన్నాథ్ విఫలం అయ్యాడనే మాట వినిపించింది. ఈ సినిమా ఫెయిల్యూర్ ఇంపాక్ట్ నుంచి బయటకొచ్చిన రామ్ పోతినేని నెక్స్ట్ సినిమాపై ఫోకస్ చేశారు. ఇప్పటికే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు.పి దర్శకత్వంలో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ సినిమా ఏ జోనర్ లో తెరకెక్కుతోందనేది ఇంకా క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్స్ లో హరీష్ శంకర్ రామ్ పోతినేనితో సినిమా చేయనున్నట్లు తెలిపాడు. త్వరలో ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేసి రామ్ కి వినిపిస్తానని హరీష్ శంకర్ చెప్పారు. దీంతో రామ్ పోతినేని హరీష్ శంకర్ తో సినిమా చేసే అవకాశం ఉందనే ప్రచారం తెరపైకి వచ్చింది.

మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ కావడంతో హరీష్ శంకర్ తో సినిమా విషయంలో రామ్ పునరాలోచనలో పడ్డారంట. వరుసగా మూడు కమర్షియల్ డిజాస్టర్ ల తర్వాత మరల అదే జోనర్ లో సినిమా అంటే రిస్క్ అని భావిస్తున్నాడంట. అందుకే ఒక డిఫరెంట్ కథను మహేష్ బాబుతో చేయనున్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని రామ్ పోతినేని డిసైడ్ అయ్యారంట. అలాగే సినిమాకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.

ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్.. ఇలా గ్యాప్ లేకుండా వరుసగా మాస్ కథలతోనే ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాడు. అందుకే ఈ సారి మాత్రం రిస్క్ చేయకుండా సేఫ్ తనకి సెట్ అయ్యే కథతోనే సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నారంట. అందుకే సక్సెస్ ట్రాక్ లో ఉన్న మహేష్ తో రెడీ అవుతున్నాడు. ఇక నెక్స్ట్ పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ ఉంటేనే కంప్లీట్ మాస్ జోనర్ లో సినిమాని చేయాలని రామ్ పోతినేని డిసైడ్ అయ్యారంట. ఇక హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో కచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ సక్సెస్ అయితే తర్వాత రామ్ పోతినేని హరీష్ శంకర్ కి ఏమైనా ఛాన్స్ ఇస్తాడా అనేది చూడాలి.