Begin typing your search above and press return to search.

హరీష్ నెక్స్ట్.. అంతా సిద్ధమేనా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్.. రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Feb 2025 6:12 AM GMT
హరీష్ నెక్స్ట్.. అంతా సిద్ధమేనా?
X

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్.. రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఆ సినిమాతో మంచి హిట్ అందుకుంటారని అంతా అంచనా వేశారు. కానీ ఆ మూవీ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు.

అదే సమయంలో ఆయన పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. ఆ తర్వాత రాజకీయాల్లో పవన్ బిజీగా మారడం వల్ల ప్రాజెక్ట్ హోల్డ్ లోకి వెళ్ళిపోయింది. రీసెంట్ గా హరీష్ శంకర్.. స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశారని వార్తలు వచ్చాయి. బౌండ్ స్క్రిప్ట్ లాక్ చేశారని వినికిడి.

అయితే పవన్.. హరిహర వీరమల్లు, ఓజీ పూర్తయ్యాక ఉస్తాద్ సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అందుకు కాస్త సమయం పట్టేలా కనిపిస్తోంది. అదే సమయంలో యంగ్ హీరో రామ్ పోతినేనితో హరీష్ శంకర్ చర్చలు జరుపుతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ ఓ క్రేజీ స్టోరీపై వర్క్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే రామ్ కు రెండు సార్లు హరీష్ శంకర్ స్టోరీ నెరేట్ చేశారని సమాచారం. రామ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. సమ్మర్ తర్వాత షూటింగ్ మొదలు కానుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బౌండ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్న హరీష్ శంకర్.. క్యాస్టింగ్ తో పాటు టెక్నీషియన్స్ ను కూడా ఖరారు చేసే పనిలో ఉన్నారట.

అయితే రామ్, హరీష్ శంకర్ మూవీని శ్రీ అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించనున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన రామ్ తో పాటు హరీష్ కు అడ్వాన్స్ చెల్లించారని తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని వినికిడి. అయితే కృష్ణ కొమ్మలపాటి.. సాయి ధరమ్ తేజ్ జవాన్, సత్యదేవ్ కృష్ణమ్మ సినిమాలకు దర్శకత్వం వహించారు.

ఇప్పుడు రామ్- హరీష్ శంకర్ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం రామ్.. మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టితో విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మహేశ్‌ తో వర్క్ చేస్తున్నారు. హై ఎనర్జీతో న్యూ ఏజ్‌ స్టోరీగా రూపొందుతున్న ఆ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ మూవీ పూర్తయ్యాక.. హరీష్ శంకర్ ప్రాజెక్టు స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. మరి చూడాలి ఎప్పుడు మొదలవుతుందో..