మాస్ డైరెక్టర్.. పిల్లలు కావాలనే వద్దనుకున్నాడట
బాలీవుడ్ రైడ్ కు రీమేక్ గా ఆ మూవీ తెరకెక్కగా.. రీమేక్స్ విషయంలో ఈసారి హరీష్ శంకర్ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు.
By: Tupaki Desk | 30 March 2025 8:30 PMటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే తెలుగు సినీ ప్రియులకు పలు సూపర్ హిట్ సినిమాలు అందించిన ఆయన.. ఇప్పుడు అనుకున్నంత స్థాయిలో మెప్పించలేక పోతున్నారు. రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ హిట్ అవుతుందని అంతా అనుకోగా.. ఫ్లాప్ గా మారింది.
బాలీవుడ్ రైడ్ కు రీమేక్ గా ఆ మూవీ తెరకెక్కగా.. రీమేక్స్ విషయంలో ఈసారి హరీష్ శంకర్ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పటికే ఆయన చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉండగా.. ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుందో ఇంకా క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడంతో.. హరీష్ శంకర్ ఇప్పుడు సినిమాల పరంగా ఖాళీనే ఏమో!
అయితే పలు సినిమాల ఈవెంట్స్ లో అప్పుడప్పుడు కనిపించే హరీష్ శంకర్.. సినిమాల కోసం ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతుంటారు. వార్తల్లో కూడా నిలుస్తుంటారు. కానీ ఎప్పుడు ఎక్కడా తన వ్యక్తిగత విషయాలను మాత్రం ప్రస్తావించరు. ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో కూడా హరీష్ శంకర్ పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడడం కనపడలేదు.
కానీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి మాట్లాడారు. తనతోపాటు తాను భార్య స్నిగ్ధ.. పిల్లలు వద్దనుకున్న విషయాన్ని తెలిపారు. దాని వెనుక ఉన్న కారణమేంటో కూడా చెప్పారు. తమది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని, తనపై చాలా బాధ్యతలు ఉన్నాయని తెలిపారు. వాటిని తీర్చుతూ వచ్చానని వెల్లడించారు హరీష్ శంకర్.
ఆ విషయంలో తన భార్య ఫుల్ గా సపోర్ట్ చేసిందని గుర్తు చేసుకున్నారు. తన లైఫ్ లో మరే ఇతర బాధ్యతలు వద్దనుకున్నానని, అప్పుడే స్నిగ్ధతో మాట్లాడానని తెలిపారు. పిల్లలు వద్దనుకున్నామని, ఒకవేళ వారు ఉంటే పుట్టిన తర్వాతే స్వార్థంగా మారుతామని వ్యాఖ్యానించారు. పిల్లల చుట్టూ పేరెంట్స్ జీవితాలు తిరుగుతాయని అన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. కూడా పిల్లలు లేకపోవడం వల్ల నిస్వార్థం ఉన్నారని అన్నారు హరీష్ శంకర్. అందుకే ఆయనను ప్రజలు నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. స్నిగ్ధకు సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదని చెప్పారు. ఆఫీస్ తో పాటు సెట్స్ లో మూవీల కబుర్లు ముగుస్తాయని అన్నారు. అదే సమయంలో తన రెమ్యునరేషన్ కూడా భార్యకు తెలియదని చెప్పారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.