Begin typing your search above and press return to search.

హరీష్ శంకర్ ని అంతగా టచ్ చేసింది ఏంటో..?

ఈ తరం దర్శకులు కూడా కొందరు సిల్వర్ స్క్రీన్ పై తమని చూసుకోవాలన్న కోరిక తీర్చుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   19 Feb 2025 4:58 PM GMT
హరీష్ శంకర్ ని అంతగా టచ్ చేసింది ఏంటో..?
X

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెర వెనుక ఉండి సినిమాలు చేస్తాడు. అదేంటి డైరెక్టర్ కాబట్టి ఆఫ్ స్క్రీన్ లోనే పని ఉంటుంది కదా అనుకోవచ్చు. అలా అని కాదు కొంతమంది దర్శకులు దర్శకత్వం తో పాటు తెర మీద కూడా కనిపిస్తారు. విశ్వనాథ్ గారు అందుకు ఉదాహరణ. ఈ తరం దర్శకులు కూడా కొందరు సిల్వర్ స్క్రీన్ పై తమని చూసుకోవాలన్న కోరిక తీర్చుకుంటున్నారు. ఐతే ఈ లిస్ట్ లో ఇప్పుడు హరీష్ శంకర్ కూడా చేరుతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ హరీష్ శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న టైం లో అలా తళుక్కున మెరిసాడు.

నిప్పు, నేనింతే సినిమాల్లో హరీష్ శంకర్ ఇలా వచ్చి అలా వేళ్లే రోల్ చేశాడు. ఐతే ఈసారి హరీష్ శంకర్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. యువ హీరో సుహాస్ హీరోగా రామ్ గోధల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఓ భామ అయ్యో రామ. ఈ సినిమాను హరీష్ నల్ల నిర్మిస్తున్నారు. సినిమాలో సుహాస్ సరసన మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఐతే ఈ సినిమాలో హరీష్ శంకర్ ఒక మంచి పాత్రలో కనిపిస్తారట. లవ్ స్టోరీగా రాబోతున్న ఓ భామ అయ్యో రామ సినిమాలో హరీష్ శంకర్ నటిస్తున్నాడు అన్న విషయం తెలియగానే స్టార్ డైరెక్టర్ ని టచ్ చేసేంత సినిమాలో ఏముంది అని అనుకుంటున్నారు. హరీష్ శంకర్ కూడా ఒకసారి సరదాగా ట్రయిల్ వేద్దామన్నట్టుగా ఈ సినిమాలో నటిస్తున్నాడు.

మామూలుగా అయితే హరీష్ శంకర్ ఈవెంట్స్ లో మైక్ అందుకుంటేనే అదరగొట్టేస్తాడు. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై ఇంపార్టెంట్ రోల్ అంటున్నారు కాబట్టి ఆ పాత్ర ఎంత నచ్చితే ఈ డైరెక్టర్ చేసేందుకు ఒప్పుకున్నాడు అని చెప్పుకుంటున్నారు. హరీష్ శంకర్ నటుడిగా క్లిక్ అయితే మాత్రం డైరెక్షన్ వదిలేసి ఆర్టిస్ట్ గా కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు మళ్లీ మొదలు పెట్టాలని చూస్తున్నాడు హరీష్ శంకర్. డైరెక్టర్ గా ఎలాగు కాస్త టైం ఉందని ఈలోగా నటుడిగా తన టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయినట్టు ఉన్నాడు హరీష్ శంకర్. మరి వెండితెర మీద హరీష్ శంకర్ అటెంప్ట్ ఎంతమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.