Begin typing your search above and press return to search.

మిస్టర్ బచ్చన్.. ఆ స్టెప్పుపై హరీష్ శంకర్ వివరణ!

కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ని ఇష్టపడేవారికి సినిమా బాగానే నచ్చుతుందనే మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   16 Aug 2024 4:12 AM GMT
మిస్టర్ బచ్చన్.. ఆ స్టెప్పుపై హరీష్ శంకర్ వివరణ!
X

రవితేజ, హరీష్ శంకర్ కలయికలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాపై ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ కారణంగా మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందంట. అయితే పబ్లిక్ టాక్ ఎలా ఉంటుందనే దానిపై మూవీ కమర్షియల్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ని ఇష్టపడేవారికి సినిమా బాగానే నచ్చుతుందనే మాట వినిపిస్తోంది.


ఇదిలా ఉంటే సినిమాలో రవితేజ, భాగ్యశ్రీ మీద చిత్రీకరించిన సితార సాంగ్ లో స్టెప్పులు కొన్ని అభ్యంతరకంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన సితార సాంగ్ లో హీరోయిన్ బ్యాక్ పాకెట్స్ లో రవితేజ చేతులు పెట్టి వేసిన స్టెప్స్ పై ట్రోలింగ్ జరిగింది. చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సాంగ్ రిలీజ్ అయిన సమయంలోనే ఆ డాన్స్ మూమెంట్స్ పై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.

అయితే సాంగ్ బాగుండటంతో అందరూ ఆస్వాదించారు. ఇదిలా ఉంటే మూవీ రిలీజ్ తర్వాత అదే సితార సాంగ్ లో మరో స్టెప్పుపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ బీట్ దగ్గర రవితేజ హీరోయిన్ నడుము క్రింద అభ్యంతరకరంగా చేతులు పెడతాడు. ఇది సాంగ్ లో భాగంగానే ఉంటుంది. ఇంత అసభ్యకరంగా స్టెప్పులు ఎలా వేయిస్తారని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

తాజాగా జరిగిన మూవీ సక్సెస్ మీట్ లో ఈ స్టెప్పుపై హరీష్ శంకర్ వివరణ ఇచ్చారు. ఆ సాంగ్ షూటింగ్ ఫస్ట్ డే శేఖర్ మాస్టర్ ఆ స్టెప్పులని కంపోజ్ చేశారు. డైరెక్ట్ గా చూసినపుడు సాంగ్ సిచువేషన్ కి ఆ స్టెప్పుకి సంబంధం లేనట్లు అనిపించింది. కాస్తా అభ్యంతరకంగానే ఉన్నాయి. అయితే మొదటి రోజే స్టెప్స్ బాగోలేదు, వద్దని చెబితే డిజప్పాయింట్ అవుతారని చెప్పలేదు. సాంగ్ ఫ్లోలో వెళ్తున్నప్పుడు అది పెద్దగా ఇబ్బందిగా అనిపించదు. కేవలం దానిని జూమ్ చేసి ఫోటో తీసి బూతద్దంలో పెట్టి చూపిస్తే కాస్తా అభ్యంతరకంగా అనిపిస్తుంది.

అది మాత్రమే కాదు ఏ డాన్స్ మూమెంట్ చూసిన అలాగే ఇబ్బందిగా కనిపిస్తుంది. అదే సాంగ్ ఫ్లోలో చూస్తే పెద్దగా ఎవరూ పట్టించుకోరు. షూటింగ్ సెటప్ లో నేను బిజీగా ఉన్నాను. అవసరం లేదనిపించిన కూడా వదిలేసాను. అయితే వాటిని పర్టిక్యులర్ గా చూపించి ట్రోల్ చేయడం వెనుక ఎవరి అజెండా వారికుంటుంది. అయిన కానీ ఆ డాన్స్ మూమెంట్ పై వచ్చిన కామెంట్స్ ని నేను యాక్సప్ట్ చేస్తున్న. అందుకే వాటిని కౌంటర్ చేయాలని అనుకోలేదని హరీష్ శంకర్ వివరణ ఇచ్చారు.