పవన్ 'ఉస్తాద్' ఐదు రోజులే అయ్యిందట...!
ఆ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ మాట్లాడుతూ... ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ కళ్యాణ్ గారితో కేవలం అయిదు రోజులు మాత్రమే షూట్ చేశాడు.
By: Tupaki Desk | 13 March 2024 11:18 AM GMTపవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో 12 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ మూవీ వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వీరి కాంబోలో సినిమా రాబోతుంది. ఇప్పటికే వీరి కాంబో మూవీని అధికారికంగా ప్రకటించడంతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ను కూడా పెట్టారు.
ఆ మధ్య షూటింగ్ హడావుడి చాలా రోజులు చేశారు. ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి చేసి ఉంటాడు, మరో సగం ను ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తి చేస్తాడేమో అనుకుంటున్నారు. వారంతా కూడా షాక్ అయ్యే విషయాన్ని హరీష్ శంకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో షేర్ చేశాడు.
ఆ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ మాట్లాడుతూ... ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ కళ్యాణ్ గారితో కేవలం అయిదు రోజులు మాత్రమే షూట్ చేశాడు. ఐదు రోజుల్లో పదిహేను రోజులకు సరిపడ షూట్ ని పూర్తి చేశాము. 12 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ సెట్స్ లో ఎలా అయితే పవన్ కనిపించాడో ఇప్పుడు అలాగే ఉన్నారు.
ఆయన జోష్ మరియు స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు అన్నట్లుగా హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. తప్పకుండా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది అంటూ మరోసారి ఫ్యాన్స్ కి హామీ ఇచ్చాడు. పవన్ సినిమాను పక్కన పెట్టి మరో సినిమాను చేస్తున్న హరీష్ శంకర్ జూన్ లేదా జులై లో ఉస్తాద్ ను రీ షురూ చేసే అవకాశాలు ఉన్నాయి.