హరీశ్ శంకర్.. పవన్ ఔట్.. రవితేజ ఇన్
రాజకీయాలతో మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీ
By: Tupaki Desk | 17 July 2023 5:15 AM GMTగత కొద్ది కాలంగా పవన్ కల్యాణ్ ఓ వైపు రాజకీయాలతో మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనపడట్లేదు. ఏపీలో ఎలెక్షన్స్ దగ్గరపడుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఆయన ఫూర్తి ఫోకస్ పొలిటిక్స్పైనే పెడుతున్నారు. దీంతో ఆయన నటించే సినిమాల షూటింగ్‌లు వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సింగ్ గురించి వార్త ఒకటి బయటకు వచ్చింది.
అదేంటంటే.. ఇప్పుడీ సినిమా షూటింగ్ పూర్తిగా ఆగిపోయినట్లు తెలిసింది. అసలీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు నుంచి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'గబ్బర్ సింగ్' సినిమా తర్వాత దర్శకుడు హరీశ్ శంకర్-పవన్ కల్యాణ్.. కాంబో కావడం వల్ల సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడో మూడేళ్ల క్రితం ఈ చిత్రాన్ని ప్రకటించారు. అయినా ఇది కొన్ని నెలల క్రితమే సెట్స్‌పైకి వెళ్లింది. కానీ ఎక్కవ రోజుల పాటు షూట్ జరుపుకోలేదు. కేవలం రెండు, మూడు షెడ్యూల్స్ మాత్రమే షూట్ జరిగింది.
అయితే ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఏపీలో ఎలక్షన్స్ ఉండటం వల్ల.. ప్రస్తుతం పవన్ పొలిటిక్స్‌పై ఫూర్తి దృష్టి పెట్టారు. ప్రచార సభలు అంటూ బిజీగా తిరుగుతున్నారు. దీంతో ఆయన తన సినిమాలకు డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. పవన్ చేతిలో ఈ ఉస్తాద్‌తో పాటు భారీ యాక్షన్ ఎంటర్టైనర్ OG, హరిహర వీరమల్లు, బ్రో కూడా ఉన్నాయి. బ్రో ఇప్పటికే పూర్తై జులై 29న రిలీజ్‌కు రెడీ అయిపోయింది.
OGకు మరో 20 రోజుల పాటు పవన్ డేట్స్ ఇస్తే సరిపోతుందని ఇన్సైడ్ టాక్. కాబట్టి ఈ సినిమా వరకు మాత్రం డేట్స్ ఇచ్చి ఎలాగైనా పూర్తి చేస్తారని అంటున్నారు. ఇక హరిహరవీరమల్లు, ఉస్తాద్‌ను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కంటిన్యూ చేస్తారని తెలిసింది. అయితే పవన్ కోసం గత మూడేళ్ళుగా వేరే ఏ సినిమాకు కమిట్ అవ్వకుండా ఉన్నారు హరీశ్ శంకర్.
కానీ ఇది ఎలాగో అవ్వద్దని ఇప్పుడో క్లారిటీకి వచ్చారట. దీంతో హరీశ్ కూడా ఈ ప్రాజెక్ట్‌ను ఎలక్షన్స్ పూర్తయ్యేవరకు పక్కనపెట్టి.. మాస్ మహారాజా రవితేజ ఓ సినిమా చేయనున్నారని తెలిసింది.
ఐదేళ్ల క్రితం బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన 'రైడ్' చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. రవితేజకు 'ధమాకా' వంటి భారీ బ్లాక్ బాస్టర్ ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం అందింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ హక్కులు కూడా ఈ సంస్థ దక్కించుకుందని టాక్ వినిపిస్తోంది.