Begin typing your search above and press return to search.

మెగాస్టార్ తో పవన్ డైరెక్టర్.. మ్యాటర్ ఏమిటంటే..

మా ఇద్దరి కాంబినేషన్ లో మూవీ కచ్చితంగా ఉంటుందని హరీష్ శంకర్ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు.

By:  Tupaki Desk   |   5 Aug 2024 1:23 PM GMT
మెగాస్టార్ తో పవన్ డైరెక్టర్.. మ్యాటర్ ఏమిటంటే..
X

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ లో వాల్తేరు వీరయ్యతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మిగిలిన సినిమాలు అన్ని ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. ఆచార్య, భోళా శంకర్ సినిమాలు అయితే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా మారాయి. ప్రస్తుతం సినిమాలు చూసే విషయంలో పబ్లిక్ ఇంటరెస్ట్ పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరో అనే ఇమేజ్ కేవలం సినిమా ఓపెనింగ్స్ వరకు మాత్రమే పనిచేస్తోంది. కథలో దమ్ముంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

యావరేజ్ టాక్ వచ్చిన కూడా థియేటర్స్ కి వెళ్లి సినిమాని చూడటానికి ఆడియన్స్ ఆసక్తి చూపించడం లేదు. అందుకే చిరంజీవి కథల ఎంపికలో ప్రేక్షకుల అభిరుచిని పరిగణంలోకి తీసుకొని మూవీస్ చేయడానికి రెడీ అయ్యారు. అందులో భాగంగా సోషియో ఫాంటసీ కథాంశంతో విశ్వంభర చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి చేస్తున్నారు. వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

దీని తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ఇంకో సినిమాని మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్నారు. ఇదిలా ఉంటే మాస్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో కూడా మెగాస్టార్ చిరంజీవి మూవీ ఉందనే టాక్ ప్రచారంలో ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ మూవీ ఆగష్టు 15న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవితో సినిమా గురించి హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు.

చిరంజీవికి కథ చెప్పడం జరిగిందని హరీష్ శంకర్ చెప్పారు. ఆ స్టోరీ కూడా మెగాస్టార్ కి నచ్చిందని అన్నారు. మా ఇద్దరి కాంబినేషన్ లో మూవీ కచ్చితంగా ఉంటుందని హరీష్ శంకర్ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. అయితే ఆ మూవీ ఎప్పుడుంటుందనేది చిరంజీవి నేరుగా ప్రకటిస్తారని అన్నారు. హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ తర్వాత పవన్ కళ్యాణ్ తో స్టార్ట్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ పై ఫోకస్ చేయనున్నారు. ఇప్పటికే ఆ సినిమా 30% షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం.

వీలైనంత వేగంగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాదిలోనే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ చేయాలని హరీష్ శంకర్ అనుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కాల్ షీట్స్ ఇస్తారా అనే దానిపై ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక మెగాస్టార్ చిరంజీవితో హరీష్ శంకర్ మూవీ స్టార్ట్ అవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది.