Begin typing your search above and press return to search.

మిస్టర్ బచ్చన్.. ఆకాశంలో భారీగా అలా!

తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి హరీష్ శంకర్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇంట్రెస్టింగ్ ఫోటోను పోస్ట్ చేసి మూవీపై మరిన్ని అంచనాలు పెంచారు.

By:  Tupaki Desk   |   7 Jun 2024 5:43 AM GMT
మిస్టర్ బచ్చన్.. ఆకాశంలో భారీగా అలా!
X

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ 2024లో ఇప్పటికే ఈగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆడియన్స్ ను అనుకున్న రీతిలో ఆకట్టుకోలేకపోయింది. రవితేజ మాత్రం తన యాక్టింగ్ తో మంచి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నారు. మరాఠీ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది.

నామ్ తో సునా హోగా అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్.. సినీ ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమాపై మంచి బజ్ కూడా క్రియేట్ చేసింది. మిర‌ప‌కాయ్ మూవీ త‌ర్వాత రవితేజ, హరీశ్‌ శంకర్‌ కాంబోలో మిస్టర్ బచ్చన్ వ‌స్తుండ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఈ సినిమాలో రవితేజ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ నేపథ్యంలో సాగే సన్నివేశాలను తెరకెక్కిస్తున్న‌ట్లు ఆ మధ్య మేకర్స్ తెలిపారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి హరీష్ శంకర్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇంట్రెస్టింగ్ ఫోటోను పోస్ట్ చేసి మూవీపై మరిన్ని అంచనాలు పెంచారు.

ఇటీవల యాక్షన్ సీక్వెన్స్ కోసం మేకర్స్ భారీ సెట్ ను వేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఓ పిక్ ను హరీష్ పోస్ట్ చేశారు. పిక్ పై ఎయిమింగ్ ఫర్ స్కై అంటూ రైటప్ ఇచ్చారు. దీంతో ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ ను ఓ రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై ఆ సీన్స్ ను చూసి ఆడియన్స్ ఈలలు వేయడం పక్కా అని అర్థమవుతోంది. మొత్తానికి హరీష్ శంకర్ లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

మరోవైపు, ఇటీవల అప్డేట్స్ తో పాటు అనౌన్స్మెంట్ కు ఇది టైమ్ అంటూ పోస్ట్ చేశారు హరీష్. దీంతో మేకర్స్ వరుస అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారని టాక్. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ వచ్చే నెల చివర్లో రిలీజ్ అవుతుందని వినికిడి. మరి చూడాలి ఎప్పుడు విడుదల చేస్తారో.