Begin typing your search above and press return to search.

హ‌రీష్ శంక‌ర్ కోరిక‌లు నెర‌వేర‌డం లేదే!

ప్ర‌తీ ద‌ర్శ‌కుడుకి ఓ డ్రీమ్ అంటూ ఉంటుంది. త‌మ విజ‌న్ కి త‌గ్గ సినిమాలు చేయాల‌ని బ‌లంగా ఉంటుంది కానీ అది సాధ్య‌ప‌డదు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 10:56 AM GMT
హ‌రీష్ శంక‌ర్ కోరిక‌లు నెర‌వేర‌డం లేదే!
X

ప్ర‌తీ ద‌ర్శ‌కుడుకి ఓ డ్రీమ్ అంటూ ఉంటుంది. త‌మ విజ‌న్ కి త‌గ్గ సినిమాలు చేయాల‌ని బ‌లంగా ఉంటుంది కానీ అది సాధ్య‌ప‌డదు. ఓ క‌థ రాస్తున్నారంటే ఎన్నో అంశాల్ని దృష్టిలో పెట్టుకుని రాయాల్సి ఉంటుంది. అలాంటి స‌మ‌యంలో విజ‌న్ అనేది డైవ‌ర్ట్ అవ్వ‌డానికి ఛాన్స్ ఉంటుంది. సినిమా అనేది వ్యాపారం కాబ‌ట్టి...ఆ కోణాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి స‌మ‌యంలో కొన్ని ర‌కాల డివియే ష‌న్స్ వ‌స్తుంటాయి.

ఇది ప్ర‌తీ ద‌ర్శ‌కుడు..ర‌చ‌యిత పేస్ చేసేదే. అలా కాకుడ‌దంటే వాళ్లే నిర్మాత‌లుగా మారాలి. అప్పుడే అది సాధ్య‌మ‌వుతుంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ మాట‌ల్ని బ‌ట్టి అదే అర్ద‌మ‌వుతుంది. సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో ముచ్చ‌టించిన హ‌రీష్ శంక‌ర్ ముందుకు ఓ ఆస‌క్తిర ప్ర‌శ్న వెళ్లింది. వెంక‌టేష్ హీరోగా బారిష్ట‌ర్ పార్వ‌తీశం తెర‌కెక్కిస్తారా? అని ఓ నెటి జ‌నుడు అడిగాడు. దానికి హ‌రీష్ బ‌ధులిస్తూ.. నీ ఆలోచ‌న బాగుంది. చ‌లం రాసిన `మైదానం` ని సినిమాగా తీయాలాని నాకు ఉంది.

ఇండ‌స్ట్రీకి అందుకే వ‌చ్చాను. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ తీయ‌లేక‌పోయాను. అందుకు ఎన్నో కార‌ణాలున్నాయి. సినిమా మ‌న‌ల్ని ఎంచుకుంటుంది గానీ..మ‌నం సినిమాల్ని ఎంచుకోలేం` అని అన్నారు. ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి ఓ ద‌ర్శ‌కుడు ఎంత‌గా రాజీ ప‌డాల్సి ఉంటుంది? అన్న‌ది అద్దం ప‌డుతుంది. ఇప్ప‌టివ‌ర‌కూ హ‌రీష్ శంక‌ర్ తీసిన చిత్రాల‌న్ని క‌మ‌ర్శియ‌ల్ గా రాణించిన‌వే.

`షాక్` తో షాక్ తిన్నా..`మిర‌ప‌కాయ్` తో మంచి హిట్ అందుకున్నాడు. అటుపై `గ‌బ్బ‌ర్ సింగ్` తో భారీ స‌క్స‌స్ ఖాతాలో వేసుకున్నాడు. ఆ త‌ర్వాత చేసిన సినిమాలేవి పెద్ద‌గా ఆడ‌లేదు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్` తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. హిట్ అందుకుని రేసులోకి రావాల‌ని హ‌రీష్ గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నా