Begin typing your search above and press return to search.

బచ్చన్‌ ఓకే అయితే మహేష్‌ ఆలోచిస్తాడేమో..!

అయితే మహేష్ బాబు మాత్రం చాలా తక్కువ సినిమాలను, చాలా నమ్మకస్తులైన దర్శకులతో మాత్రమే చేస్తూ ఉన్నాడు.

By:  Tupaki Desk   |   8 Aug 2024 7:21 AM GMT
బచ్చన్‌ ఓకే అయితే మహేష్‌ ఆలోచిస్తాడేమో..!
X

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుతో సినిమా చేయాలని కొత్తగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దర్శకుల నుంచి సీనియర్ దర్శకుల వరకు ఎంతో మంది అనుకుటారు. ఆయన ఒప్పుకుంటో ఆహా.. ఓహో అనే స్థాయిలో సినిమా ను తీస్తాను అంటూ దర్శకులు మాట్లాడటం మనం వింటూనే ఉంటాం. మహేష్ బాబు కోసం అంటూ ఎంతో మంది దర్శకులు, రచయితలు కథలు రాయడం కూడా జరుగుతుంది. అయితే మహేష్ బాబు మాత్రం చాలా తక్కువ సినిమాలను, చాలా నమ్మకస్తులైన దర్శకులతో మాత్రమే చేస్తూ ఉన్నాడు.

అలాంటి మహేష్ బాబుతో సినిమా చేయాలని కోరుకుంటున్నట్లుగా దర్శకుడు హరీష్ శంకర్‌ ప్రకటించాడు. తాజాగా ఈయన దర్శకత్వంలో రూపొందిన మిస్టర్‌ బచ్చన్ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఆగస్టు 15న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్ కార్యక్రమం లాంచనంగా జరిగింది. ఆ కార్యక్రమంలో హరీష్ శంకర్ మాట్లాడుతూ తాను మహేష్ బాబుతో పోకిరి వంటి సినిమా ను తీయాలి అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

గతంలో పవన్‌ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి సూపర్‌ హిట్‌ ను తెరకెక్కించిన దర్శకుడు హరీష్ శంకర్ ఆ తర్వాతి కాలంలో తీసిన సినిమాల కారణంగా కాస్త డౌన్ అయ్యాడు. అయితే ఆయన ప్రతిభతో మళ్లీ పుంజుకోవడం ఖాయం అంటూ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. గత చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, రవితేజ తో రూపొందించిన మిస్టర్ బచ్చన్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే హరీష్ శంకర్ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు అంటున్నారు.

హరీష్‌ శంకర్ ప్రస్తుతం చేస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నట్లయితే కచ్చితంగా మహేష్ బాబు నుంచి పిలుపు వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫిల్మ్‌ మేకింగ్‌ లో వర్మ మరియు పూరి తరహా మార్క్ ను హరీష్ శంకర్ కలిగి ఉంటాడు. కనుక ఆయన దర్శకత్వంలో నటించాలని పెద్ద హీరోలు కూడా అనుకుంటారు. అయితే ఆయన వరుస సక్సెస్ లను దక్కించుకున్నప్పుడు మాత్రమే ఆ ఆఫర్లు వస్తాయి.

ఇప్పటికే పవన్‌ కళ్యాణ్ తో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాను మొదలు పెట్టాడు. ప్రస్తుతం పవన్‌ రాజకీయాలతో బిజీగా ఉన్న కారణంగా హరీష్ శంకర్ ఈ గ్యాప్‌ లో మిస్టర్‌ బచ్చన్ సినిమాను రూపొందించాడు. త్వరలోనే సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. మిస్టర్‌ బచ్చన్ సినిమా తర్వాత పవన్‌ సినిమా పనిలో హరీష్ శంకర్ పడే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమా కూడా హిట్ అయితే హరీష్ కోరుకున్నట్లుగా మహేష్ బాబుతో సినిమా ఉండే అవకాశం ఉంది.