Begin typing your search above and press return to search.

5 ఏళ్ళ గ్యాప్ వచ్చినా.. లైన్ లో 4 సినిమాలు!

టాలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని హరీష్ శంకర్ సొంతం చేసుకున్నారు

By:  Tupaki Desk   |   14 Feb 2024 4:00 AM GMT
5 ఏళ్ళ గ్యాప్ వచ్చినా.. లైన్ లో 4 సినిమాలు!
X

టాలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని హరీష్ శంకర్ సొంతం చేసుకున్నారు. రీమేక్ కథలకి కూడా తనదైన స్టైల్ ట్రీట్మెంట్ తో బ్లాక్ బస్టర్ అందుకోవడంలో హరీష్ దిట్ఠా. ఆయన చేసిన గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ చిత్రాలు ఒరిజినల్ వెర్షన్స్ కంటే పెద్ద కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. అందుకే రీమేక్ కింగ్ అని హరీష్ ని పిలుస్తూ ఉంటారు.

హరీష్ శంకర్ చివరిగా 2019లో వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆ తరువాత ఏకంగా ఐదేళ్లు గ్యాప్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తారని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయన 2023 లో డేట్స్ ఇవ్వడంతో నిరీక్షణకి తెరపడింది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ సగం షూటింగ్ కంప్లీట్ కాకుండానే మళ్ళీ పవన్ రాజకీయాలలో బిజీ అయ్యారు.

దీంతో ఈ సినిమా నిరవధిక వాయిదా పడింది. ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత ఈ మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. ఈ లోపు మాస్ మహారాజ్ రవితేజ తో మిస్టర్ బచ్చన్ సినిమాని హరీష్ శంకర్ స్టార్ట్ చేసి షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హిందీలో రైడ్ కి రీమేక్ గా మిస్టర్ బచ్చన్ తెరకెక్కుతోంది.

దీని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ పై ఫోకస్ చేయనున్నాడు. ఈ రెండు కంప్లీట్ కాకుండానే హరీష్ శంకర్ స్టార్ హీరోలతో మరో రెండు ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఒక సినిమా కన్ఫర్మ్ అయ్యింది. విశ్వంభర కంప్లీట్ అయ్యాక హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా ఉండొచ్చని టాక్

అలాగే బాలకృష్ణ హీరోగా కెవిఎన్ ప్రొడక్షన్స్ లో ఒక మూవీని హరీష్ ఫైనల్ చేసుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఎనౌన్సమెంట్ రావాల్సి ఉంది. ఐదేళ్లు గ్యాప్ తీసుకున్న ఇప్పుడు మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా నాలుగు సినిమాలు అందరూ స్టార్ హీరోలతోనే హరీష్ శంకర్ చేయనుండటం విశేషం.