Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తో సినిమా.. అందుకే డిజాస్టర్

మధ్యలో ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కారణంగా ఆశించిన స్థాయిలో ముందుకి సాగలేదు.

By:  Tupaki Desk   |   2 Aug 2024 5:27 AM GMT
ఎన్టీఆర్ తో సినిమా.. అందుకే డిజాస్టర్
X

కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమాతో ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యి ఉంది. గద్దలకొండ గణేష్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ ఐదేళ్లు గ్యాప్ తీసుకున్నారు. మధ్యలో ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కారణంగా ఆశించిన స్థాయిలో ముందుకి సాగలేదు.

ఈ గ్యాప్ లో హిందీ మూవీ రైడ్ కి రీమేక్ గా మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ కెరియర్ ఆరంభంలో చేసిన షాక్ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఆ తరువాత మిరపకాయ్ తో సూపర్ హిట్ అందుకున్నారు. పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ రెండింటి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో రామయ్యా వస్తావయ్యా సినిమాని ఎన్టీఆర్ చేశారు.

అయితే ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. సినిమాకి బాగుందనే టాక్ వచ్చిన కూడా కమర్షియల్ ఫెయిల్యూర్ అయ్యింది. ఆ సినిమా తర్వాత హరీష్ శంకర్ చాలా గ్యాప్ తీసుకొని గద్దలకొండ గణేష్ మూవీ చేసి సక్సెస్ అందుకున్నారు. తాజాగా మిస్టర్ బచ్చన్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రామయ్యా వస్తావయ్యా మూవీ ఫ్లాప్ గురించి హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది అనేది ఇప్పటికి చాలా మందికి అర్ధం కాలేదు.

అయితే తరువాత నాకు క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ ఇంటర్వెల్ కి చనిపోతుంది. అక్కడితో స్టోరీ ఎండ్ అయిపోయినట్లే. మెయిన్ విలన్ చనిపోయిన తర్వాత చెప్పడానికి ఇంకా ఏముంటుంది… ఈ కారణంగా సినిమా సెకెండాఫ్ చాలా పెద్ద మైనస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ చూసిన అందరూ బాగుందని అన్నారు. అయితే సెకెండాఫ్ అయ్యాక మూవీ ఫలితం పూర్తిగా మారిపోయిందని హరీష్ శంకర్ తెలిపారు.

ఎన్టీఆర్ చాలా నమ్మకంతో రామయ్యా వస్తావయ్యా అవకాశాన్ని ఇచ్చారు. అయితే ఆ సినిమాతో సక్సెస్ ఇవ్వడంలో నేను ఫెయిల్ అయ్యాను. మూవీ రిజల్ట్ కి కంప్లీట్ గా నేనే బాధ్యుడిని. కచ్చితంగా భవిష్యత్తులో ఎన్టీఆర్ కి బిగ్గెస్ట్ హిట్ ఇస్తాను అని హరీష్ శంకర్ ఇంటర్వ్యూలో తెలిపాడు.