రీమేక్ చేయడానికి రీజన్ ఇదే.. హరీష్ శంకర్
అజయ్ దేవగన్, ఇలియానా జంటగా 2018లో వచ్చిన హిందీ మూవీ రైడ్ చిత్రాన్ని హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ గా రీమేక్ చేశారు.
By: Tupaki Desk | 16 Aug 2024 1:30 PM GMTఅజయ్ దేవగన్, ఇలియానా జంటగా 2018లో వచ్చిన హిందీ మూవీ రైడ్ చిత్రాన్ని హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ గా రీమేక్ చేశారు. రైడ్ మూవీ సీరియస్ కాన్సెప్ట్ తో క్రైమ్ జోనర్ లో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది. వరల్డ్ వైడ్ గా 153+ కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. ఇప్పుడు హరీష్ శంకర్ రైడ్ సినిమాలోని మెయిన్ స్టోరీ లైన్ తీసుకొని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ కామెడీతో నడుస్తూ ఉంటుంది. మెయిన్ స్టోరీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. రైడ్ సినిమాలో ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు ఉండవు. మిస్టర్ బచ్చన్ సినిమాని కమర్షియల్ లైన్ లో చేయడంతో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ని కూడా పెట్టారు. అయితే ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. పబ్లిక్ లో కొంతమంది బాగుందని అంటూనే మరికొంతమంది ఏవరేజ్ అంటున్నారు.
మాస్ మహారాజ్ రవితేజ నుంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారు మిస్టర్ బచ్చన్ సినిమాని ఇష్టపడతారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ చిత్ర యూనిట్ నిర్వహించింది. ఇందులో హరీష్ శంకర్ మూవీకి వస్తోన్న టాక్ గురించి మాట్లాడారు. అలాగే రైడ్ సినిమాని ఎందుకు రీమేక్ చేయాలనుకున్నది కూడా క్లారిటీ ఇచ్చాడు. సినిమాకి మిక్స్డ్ రివ్యూలు వస్తాయని ముందుగానే ఎక్స్ పెక్ట్ చేసినట్లు హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. అయితే పబ్లిక్ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు.
ఈ సినిమాలో కథాంశం ఓల్డ్ ఫార్మాట్ లో, పాత సినిమాల స్టైల్ లో ఉంటుందనే విమర్శలపై హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. రైడ్ సినిమాకి రీమేక్ చేయాలనే ఇంటరెస్ట్ కలగడానికి కారణమే ఆ 90s బ్యాక్ డ్రాప్. ల్యాండ్ లైన్స్, క్యాసెట్ రికార్డ్స్, పాత పాటలు, టేప్ రికార్డ్స్. ఈ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీస్ చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది ఈ కథకి బాగా సూట్ అవుతుందని అనిపించి ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ ఫార్మాట్ లో లవ్ స్టోరీ చెప్పాను. అప్పటి వాతావరణం ఎలివేట్ చేయడం కోసం చాలా చోట్ల తిరిగి, మంచి లొకేషన్స్ పట్టుకొని షూట్ చేసాం. చాలెంజింగ్ గా ఏమీ అనిపించలేదు. ఒక ఎక్సయిట్మెంట్ కలిగింది.
అమ్మాయితో ఫోన్ లో మాట్లాడితే చాలు. గొంతు వింటే చాలు. గుడికి వస్తే చాలు అనే రోజుల నుంచి వాట్సాప్ వచ్చాక ఫోటోలు షేర్ చేసుకుంటూ, వీడియో కాల్స్ చేసుకునే పరిస్థితికి వచ్చేసాం. అప్పటి అపురూపమైన ఫీలింగ్స్ ని చెప్పాలనే ప్రయత్నంలోనే ఈ సినిమా చేసాను. సినిమాలో ఆ ఎలిమెంట్స్ ని ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారని హరీష్ శంకర్ సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. చిత్ర యూనిట్ కూడా ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో మూవీని ప్రమోట్ చేస్తోంది. 90s లో ఉండే నోస్టాలజియా జ్ఞాపకాలని మిస్టర్ బచ్చన్ మళ్ళీ గుర్తు చేస్తుందని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఈ సినిమాని ఎంటర్టైన్మెంట్, నోస్టాలజిక్ లవ్ స్టోరీ ఎంత వరకు సేవ్ చేస్తుందనేది వేచి చూడాలి.