Begin typing your search above and press return to search.

ఆల్టర్నేటివ్ అవసరం లేదు… డైరెక్ట్ గా నేనే దిగిపోతా - హరీష్ శంకర్

టాలీవుడ్ లో స్టార్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ నుంచి మిస్టర్ బచ్చన్ మూవీ ఆగష్టు 15న థియేటర్స్ లోకి రాబోతోంది

By:  Tupaki Desk   |   9 Aug 2024 4:17 AM GMT
ఆల్టర్నేటివ్ అవసరం లేదు… డైరెక్ట్ గా నేనే దిగిపోతా - హరీష్ శంకర్
X

టాలీవుడ్ లో స్టార్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ నుంచి మిస్టర్ బచ్చన్ మూవీ ఆగష్టు 15న థియేటర్స్ లోకి రాబోతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతోందని ట్రైలర్ తో పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. జగపతిబాబు ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పాత్రలో నటించారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. అందులో భాగంగా పలు ఛానల్స్ కి హరీష్ శంకర్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. సోషల్ మీడియాలో హరీష్ శంకర్ చాలా యాక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ గా ఫ్యాన్స్ చేసిన కామెంట్స్ కి కూడా హరీష్ శంకర్ రియాక్ట్ అవుతారు. తన సినిమాలకి సంబందించిన అప్డేట్స్ ఇస్తారు. అదే సమయంలో ఎవరైన విమర్శలు చేస్తే వారికి వెంటనే కౌంటర్లు ఇస్తారు.

చాలా మంది దర్శకులు అస్సలు సోషల్ మీడియాలో తమని ట్యాగ్ చేసి ఫ్యాన్స్ పోస్టులు పెట్టిన రియాక్ట్ కారు. విమర్శలపై కూడా రెస్పాండ్ కారు. కానీ హరీష్ శంకర్ మాత్రం చాలా వాటికి రెస్పాండ్ అవుతారు. హరీష్ శంకర్ పై ఎవరైన విమర్శలు చేస్తే ఒక అకౌంట్ నుంచి వారికి కౌంటర్లు పడుతూ ఉంటాయి. కొద్దిగా అబ్యూజింగ్ భాషలో విమర్శలు చేస్తారు. అయితే ఆ అకౌంట్ కూడా హరీష్ శంకర్ దే అని చాలా మంది సోషల్ మీడియాలో నమ్ముతారు.

హరీష్ శంకర్ బ్యాకప్ అకౌంట్ పెట్టుకొని దాని ద్వారా తన పీఆర్ టీమ్ తో విమర్శలు చేయిస్తారనే అభిప్రాయం ఉంది. ఈ విషయాన్ని జర్నలిస్ట్ తన ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా హరీష్ శంకర్ ని అడిగేసారు. హరీష్ శంకర్ కి ఆల్టర్నేటివ్ ట్విట్టర్ అకౌంట్ ఉందనే కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించారు. నాకు ఎవరినైనా విమర్శించాలన్నా, సమాధానం చెప్పాలన్నా డైరెక్ట్ గానే చెబుతాను.

ఇండస్ట్రీలో ఉన్న అందరికి తెలుసు నేనెంత ముక్కుసూటిగా ఉంటాననేది. ఆల్టర్నేటివ్ అకౌంట్ పెట్టుకొని విమర్శలు చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆ అకౌంట్ నా వీరాబిమానిది. నేను ఒకసారి అతనితో మాట్లాడాను. ఎవరైనా అబ్యూజింగ్ గా మాట్లాడితే మనము కూడా అదే భాషలో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని సూచించానని హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు.