Begin typing your search above and press return to search.

'సితార్' మెలోడీ.. సాహితీ లిరిక్స్.. హరీష్ స్టెప్పులు!

ఏ సినిమా అయినా హిట్ కావడంలో కథతోపాటు సాంగ్స్, ఫైట్స్, యాక్టింగ్.. ఇలా అనేక విషయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 July 2024 9:20 AM GMT
సితార్ మెలోడీ.. సాహితీ లిరిక్స్.. హరీష్ స్టెప్పులు!
X

ఏ సినిమా అయినా హిట్ కావడంలో కథతోపాటు సాంగ్స్, ఫైట్స్, యాక్టింగ్.. ఇలా అనేక విషయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే ఒకప్పుడు మూవీ రిలీజ్ కాకముందే సాంగ్స్ అన్నీ ఒక ఆల్బమ్ రూపంలో విడుదల అయ్యేవి. కానీ కొన్నేళ్లుగా మాత్రం మేకర్స్.. ప్రమోషన్స్ లో భాగంగా తమ సినిమాల నుంచి ఒక్కొక్కటిగా పాటలను విడుదల చేస్తున్నారు. వాటి ద్వారా మూవీపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.

ఇప్పుడు దర్శకుడు హరీష్ శంకర్ కూడా అదే పనిలో ఉన్నారు! మాస్ మహారాజా రవితేజ హీరోగా ఆయన మిస్టర్ బచ్చన్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ ను కంప్లీట్ చేసిన మేకర్స్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారు. రిలీజ్ కు సర్వం సిద్ధం చేస్తున్నారు.

అయితే మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి సితార్ సాంగ్ ప్రోమోను నిన్న రిలీజ్ చేశారు మేకర్స్. సితార్‌ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ ను జులై 10న విడుదల చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని తాజాగా మరోసారి గుర్తు చేశారు. అదే సమయంలో స్పెషల్ వీడియోను కూడా షేర్ చేశారు మేకర్స్. అందులో గేయ రచయిత సాహితితో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్.. సితార్ సాంగ్ కోసం చర్చించుకుంటున్నట్లు చూపించారు.

సితార్ సాంగ్ కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేసినట్లు వీడియో ద్వారా అర్థమవుతోంది. మ్యాజికల్ మెలోడీ కోసం ఇద్దరు రచయితలు ఒకే రూమ్ లో అంటూ క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. పాటను ఫైనల్ చేసే సమయంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. సాహితీ లిరిక్స్ రాస్తుండగా.. హరీష్ శంకర్ హమ్ చేసుకుంటూ చిన్న చిన్న స్టెప్పులు వేయడం బాగుంది. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఫ్యాన్స్ తెగ స్పందిస్తున్నారు.

ఎవర్ గ్రీన్ మెలోడీ సాంగ్ గా సితార్ పాట నిలవనుందని చెబుతున్నారు నెటిజన్లు. అయితే ప్రోమో ద్వారా రివీల్ చేసిన ట్యూన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంప్రెసివ్‌ గా సాగుతోంది. అందమైన లొకేషన్లలో రవితేజ, భాగ్యశ్రీ బొర్సే మధ్య డ్యూయెట్ సాంగ్ ను మేకర్స్ షూట్ చేసినట్లు ఈజీగా తెలుస్తుంది. మరి మిస్టర్ బచ్చన్ నుంచి రాబోతున్న సితార్ ఫుల్ సాంగ్.. మ్యూజిక్ లవర్స్ ను ఎంతలా అలరిస్తుందో వేచి చూడాలి.