Begin typing your search above and press return to search.

ముసలి నక్క అంటూ హరీశ్ శంకర్ మాస్ వార్నింగ్!

హరీశ్ శంకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.

By:  Tupaki Desk   |   9 July 2024 10:16 AM GMT
ముసలి నక్క అంటూ హరీశ్ శంకర్ మాస్ వార్నింగ్!
X

హరీశ్ శంకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కమర్షియల్ సినిమాలతో హిట్లు కొడుతూ, టాలీవుడ్ మాస్ డైరెక్టర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హరీష్.. తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేస్తుంటారు. సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటుగా, తన దృష్టికి వచ్చే ఇతర అంశాలపైనా స్పందిస్తుంటారు. తనకి నచ్చని వాటి గురించి నిర్మొహమాటంగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా దర్శకుడు ఎవరినో టార్గెట్ చేస్తూ పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

"రిలీజ్ దగ్గర పడుతుంది కదా… ఏం పోస్ట్ చేసినా భయపడి తగ్గుతాడు అని… ఒక ముసలి నక్క మళ్ళీ మొదలు పెడుతోంది…. దయ చేసి అలాంటి అపోహలు పెట్టుకోవద్దని మనవి.. నా జోలికొస్తే రేపు రిలీజ్ అయినా వదలను" అంటూ హరీశ్ శంకర్ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఇక్కడ దర్శకుడు ఎవరి పేరునూ ప్రస్తావించకపోవడంతో.. ఎవరిని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు. ఆ వ్యక్తిని ట్యాగ్ చేస్తే అయిపోయేది కదా హరీశ్ అన్నా అని కామెంట్లు చేస్తున్నారు.

హరీశ్ శంకర్ ఎవరిని టార్గెట్ చేస్తూ ఈ కామెంట్లు చేశారో తెలియదు కానీ, ఎవరికో బాగా గట్టిగా తగలాలనే ఈ వార్నింగ్ ఇస్తున్నట్లు అర్థమవుతోంది. అంతేకాదు 'మిస్టర్ బచ్చన్' సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలోనే ఇలాంటి పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీని గురించి నెగిటివ్ పోస్టులు పెడతారనే ఉద్దేశ్యంతోనే డైరెక్టర్ ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.

హరీశ్ శంకర్ తన సినిమాల్లో హీరో మాదిరిగానే, రియల్ లైఫ్ లోనూ వన్ లైనర్ పంచ్ డైలాగ్స్ తో అభిమానులను ఆకట్టుకుంటారు. ఇప్పుడు లేటెస్టుగా ఆయన పెట్టిన పోస్టును కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. 'ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ సోషల్ మీడియాలో వాడి వృధా చెయ్యకు, రాబోయే సినిమా కోసం దాచిపెట్టు' అని ఓ అభిమాని కామెంట్ చేశారు. 'కంటెంట్ ఉంటే ఎవరూ ఏమీ చెయ్యలేరు.. మీరు కంటెంట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టండి' అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. 'మిస్టర్ బచ్చన్' మూవీ బాగుంటే, దాన్ని ఎవరూ ఆపలేరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

'షాక్', 'మిరపకాయ్' సినిమాల తర్వాత రవితేజ, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ఇది ఒక హిందీ సినిమాలు రీమేక్ అని టాక. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ నటిస్తుండగా.. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు.