Begin typing your search above and press return to search.

ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుందంటే

కమర్షియల్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   30 July 2024 1:51 PM GMT
ఉస్తాద్ భగత్ సింగ్  ఎలా ఉంటుందంటే
X

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పరిపాలన వ్యవహారాలలో బిజీగా ఉన్నారు. మరో మూడు, నాలుగు నెలల వరకు ఆయన సినిమా షూటింగ్ లు చేసే అవకాశం అయితే లేదు. ఒక వేళ పెండింగ్ సినిమా షూటింగ్స్ స్టార్ట్ చేసిన ఒకదాని తర్వాత ఒకటి ఫినిష్ చేసే ఛాన్స్ మాత్రమే ఉంది. అన్ని కరెక్ట్ గా సెట్ అయితే నెక్స్ట్ రెండు, మూడు నెలల తర్వాత పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తాడని టాక్ నడుస్తోంది.

కమర్షియల్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అయితే ఈ ఏడాదిలో మొదలు కాకపోవచ్చనే మాట వినిపిస్తోంది. ఓజీ, హరిహర వీరమల్లు కంప్లీట్ అయ్యాక ఉస్తాద్ భగత్ సింగ్ ని పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. దీనికి చాలా సమయం పట్టొచ్చు. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేసి ఆగష్టు 15కి రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.

ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నడుస్తోంది. కేవలం 75 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ని హరీష్ శంకర్ కంప్లీట్ చేసేసారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ పై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఫ్యాన్స్ మూవీ లైబ్రరీలో ఈ సినిమాకి భద్రంగా దాచుకోవచ్చని అన్నారు. ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ ని సిల్వర్ స్క్రీన్ పై ఎలా చూడాలని అనుకుంటున్నారో ఈ చిత్రంలో అలా కనిపిస్తారని తెలిపారు.

పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాలు గుర్తుచేసుకుంటే కచ్చితంగా అందులో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా ఉంటుందని అన్నారు. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పుకునేంత ప్రత్యేకంగా ఈ సినిమా ఉండబోతోందని క్లారిటీ ఇచ్చారు. అన్ని అంశాలు ఈ సినిమా కరెక్ట్ గా సెట్ అయినట్లు చెప్పారు. హరీష్ శంకర్ మాటలతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానులకి ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి.

హరీష్ శంకర్ ఎక్కువగా రీమేక్ సినిమాలు చేసిన ఒరిజినల్ మూవీస్ కంటే అద్భుతంగా తీస్తాడనే పేరుంది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు రిలీజ్ అయిన ట్రెండ్ సెట్ చేయడం గ్యారెంటీ అని పవర్ స్టార్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తూ ఉంది. అశుతోష్ రానా, గౌతమి కీలక పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తూ ఉండటం విశేషం.