Begin typing your search above and press return to search.

మిస్ యూనివ‌ర్స్ లేడీ రెబ‌ల్ !

హ‌ర్నాజ్ కౌర్ సంధు 2021 మిస్ యూనివ‌ర్స్ టైటిల్ విజేత‌. భార‌త్ లోని పంజాబ్ నుంచి బ‌రిలోకి దిగిన అమ్మ‌డు 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో 80 మంది అందాల భామల్ని ప‌క్క‌కు నెట్టి గెలుపు గుర్రం ఎక్కింది.

By:  Tupaki Desk   |   15 Dec 2024 4:30 PM GMT
మిస్ యూనివ‌ర్స్ లేడీ రెబ‌ల్ !
X

హ‌ర్నాజ్ కౌర్ సంధు 2021 మిస్ యూనివ‌ర్స్ టైటిల్ విజేత‌. భార‌త్ లోని పంజాబ్ నుంచి బ‌రిలోకి దిగిన అమ్మ‌డు 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో 80 మంది అందాల భామల్ని ప‌క్క‌కు నెట్టి గెలుపు గుర్రం ఎక్కింది. తన అందంతో ఒక్కొక్కరినీ దాటుకుంటూ జడ్జిల మనసు గెలుచుకుంటూ విశ్వసుందరిగా నిలిచింది. కానీ అమ్మ‌డికి బాలీవుడ్లో న‌టించే అవ‌కాశం రావ‌డానికి మాత్రం చాలా స‌మయం ప‌ట్టింది.

మిస్ యూనివ‌ర్స్ విజేత అయిన వెంట‌నే పంజాబీ చిత్రాల్లో అవ‌కాశాలు వ‌చ్చాయి. `యారా దియాన్ పూన్ బరన్`, `బాయి జీ కుట్టన్ గే` లాంటి చిత్రాల్లో న‌టించింది. అలాగే ఓ మ్యూజిక్ వీడియో కూడా చేసింది. గాజ్రియా ఇండియా అవార్డు గెలుచుకుంది. కానీ బాలీవుడ్ లో ఛాన్స్ కు మాత్రం నాలుగేళ్లు ప‌ట్టింది. ఆల‌స్య‌మైనా అద్భుత‌మైన అవ‌కా శ‌మే అందుకుంది. అమ్మ‌డు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `బాఘీ` సిరీస్ లోకి అడుగు పెట్టింది.

ఇటీవ‌లే `బాఘీ-4`ని సాజిద్ న‌డియావాలా అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. టైగ‌ర్ ష్రాఫ్ హీరోగా హర్ష తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. ఈ సినిమాలో హ‌ర్నాజ్ సింధును ఓ కీల‌క పాత్ర‌కు ఎంపిక చేసారు. ఈ విష‌యాన్ని నిర్మాణ సంస్థ సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంది. మిస్ యూనివ‌ర్స్ నుంచి బాఘీ యూనివ‌ర్స్ కు స్వాగ‌తం. `బాఘీ -4` లో లేడీ రెబ‌ల్ ని ప‌రిచ‌యం చేస్తున్నాం` అని ప్ర‌క‌టించారు.

దీంతో హ‌ర్నాజ్ సంధుకు ఆలస్య‌మైనా మంచి పాత్ర ద‌క్కిన‌ట్లు అయింది. యాక్ష‌న్ సిరీస్ భాఘీ అంటే బాలీవుడ్ లో ఓ బ్రాండ్ గా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కూ రిలీజ్ అయిన మూడు భాగాలు మంచి విజ‌యం సాధించాయి. మ‌రి ఈ సినిమా రిలీజ్ లోపు మ‌రిన్ని అవ‌కాశాలు అందుకుంటుందా? రిలీజ్ త‌ర్వాత సొంతం చేసుకుంటుందా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం బాలీవుడ్ భామ‌ల మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ ఉన్న సంగ‌తి తెలిసిందే.