హరోంహర థీయాట్రికల్ బిజినెస్ ఎంతంటే?
సుధీర్ బాబు హీరోగా పీరియాడిక్ జోనర్ లో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కిన చిత్రం హరోంహర
By: Tupaki Desk | 15 Jun 2024 4:35 AM GMTసుధీర్ బాబు హీరోగా పీరియాడిక్ జోనర్ లో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కిన చిత్రం హరోంహర. శుక్రవారం ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చి పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. జ్ఞాన సాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇల్లీగల్ గన్స్ తయారీ నేపథ్యంలో ఈ కథని జ్ఞానసాగర్ అల్లుకున్నారు. కుప్పం బ్యాక్ డ్రాప్ లో కథని చెప్పారు. రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తితో హరోంహర సినిమాని తెరకెక్కించినట్లు మూవీ ట్రైలర్ లోనే చెప్పారు.
సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. తమిళనాడు, ఆంధ్రా బోర్డర్ జరిగిన ఇల్లీగల్ గా గన్స్ తయారుచేసేవాడిగా సుధీర్ బాబు ఈ చిత్రంలో నటించాడు. ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై కూడా హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగ్గట్లుగానే మొదటి రోజు పర్వాలేదనే టాక్ ఈ చిత్రం తెచ్చుకుంది. అయితే సినిమా జనాల్లోకి మౌత్ టాక్ తో ఎంత బలంగా వెళ్తుందనే దానిని బట్టి కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాపై థీయాట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. సుధీర్ బాబుకి కొంత మార్కెట్ ఉండటంతో వరల్డ్ వైడ్ గా 5.99 కోట్ల బిజినెస్ జరిగిందంట. తెలుగు రాష్ట్రాలలో 5.39 కోట్ల వ్యాపారం జరిగింది. ఈ లెక్కన చూసుకుంటే 6.30 కోట్లు కలెక్ట్ చేస్తే హరోంహర బ్రేక్ ఈవెన్ అందుకుంటుంది. ఈ కలెక్షన్స్ ని మూవీ ఎంత వరకు అందుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గత కొంతకాలంలో టాలీవుడ్ లో ఏ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోలేకపోతోంది. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా బ్రేక్ ఈవెన్ రీచ్ కాలేదు. అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. హరోంహర సినిమాకి పర్వాలేదనే టాక్ వచ్చిన పబ్లిక్ ని థియేటర్స్ వరకు వస్తారా అనేది వేచి చూడాలి. ఈ మూవీలో మాళవిక శర్మ సుధీర్ బాబుకి జోడీగా నటించింది. ఆమెకి కూడా కెరియర్ పరంగా పెద్ద సక్సెస్ లు లేవు.
సుధీర్ బాబు నుంచి గత ఏడాది వచ్చిన మామా మశ్చీంద్ర మూవీ డిజాస్టర్ అయ్యింది. దాని తర్వాత యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో హరోంహర మూవీ చేశాడు. ఇప్పుడు పీరియాడిక్ జోనర్ చిత్రాలకి డిమాండ్ పెరగడంతో సుధీర్ బాబు కూడా ఆ ఫార్మాట్ లో ప్రేక్షకుల ముందుకి రావడం విశేషం. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. పోటీగా కూడా పెద్దగా సినిమాలు లేవు. కాబట్టి వీకెండ్ లో వీలైనంత ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవాలి.