Begin typing your search above and press return to search.

మ‌హేష్ ఎందుకు రాలేదో చెప్పేసిన సుధీర్!

యంగ్ హీరో సుధీర్ బాబు ఏ సినిమా చేసినా ఆ సినిమా ప్రీ రిలీజ్ వెంట్ కి సూప‌ర్ స్టార్ మ‌హేష్ త‌ప్ప‌క హాజ‌ర‌వుతారు.

By:  Tupaki Desk   |   12 Jun 2024 6:42 AM GMT
మ‌హేష్ ఎందుకు రాలేదో చెప్పేసిన సుధీర్!
X

యంగ్ హీరో సుధీర్ బాబు ఏ సినిమా చేసినా ఆ సినిమా ప్రీ రిలీజ్ వెంట్ కి సూప‌ర్ స్టార్ మ‌హేష్ త‌ప్ప‌క హాజ‌ర‌వుతారు. మ‌హేష్ స్వ‌య‌నా బావ మ‌రిది కాబ‌ట్టి మ‌హేష్ ని ఆహ్వానించాలే గానీ అందుబాటులో ఉంటే త‌ప్ప‌కుండా హాజ‌ర‌వుతారు. మ‌హేష్ చేతుల మీదుగా ఇంత‌వ‌ర‌కూ ఎన్నో ఈవెంట్లు దిగ్విజ‌యంగా జ‌రిగాయి. సూప‌ర్ స్టార్ కృష్ణ‌- మ‌హేష్ ల‌ను ఎక్కువ‌గా సుధీర్ సినిమా ఈవెంట్ల‌లోనే అభిమానులు ఎక్కువ‌గా చూసారు.

అయితే కొంత కాలంగా మ‌హేష్ ..సుధీర్ సినిమా వేడుక‌ల‌కు హాజ‌ర‌వ్వ‌డం లేదు. తాజాగా నిన్న‌టి రోజున జ‌రిగిన `హ‌రోంహ‌ర` ప్రీరిలీజ్ లో కూడా మ‌హేష్ క‌నిపించ‌లేదు. మ‌హేష్ హైద‌రాబాద్ లో ఉన్నా ఈవెంట్లో క‌నిపించ‌డ‌క‌పోవ‌డంతో నెట్టింట చ‌ర్చ సాగుతుంది. ఈ సినిమా 14న రిలీజ్ అవుతున్న సంద‌ర్భంగా అన్ని మీడియా ఇంట‌ర్వ్యూల‌కు సుధీర్ హాజ‌ర‌వుతున్నాడు. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ రాక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాలను రివీల్ చేసారు.

అవి ఏంటో ఆయ‌న మాట‌ల్లోనే.. `అంద‌రూ నా ప్ర‌తీ సినిమాకి మ‌హేష్ వ‌స్తున్నార‌ని అనుకుంటున్నారు. కానీ అది త‌ప్పు. ఇంతవరకూ నేను 20 సినిమాలు చేశాను. వాటిలో ఐదారు సినిమాలకు సంబంధించిన ఫంక్షన్స్ లో మాత్రమే మహేశ్ బాబును ఆహ్వానించాను. ఆ తరువాత మహేశ్ ఎందుకు రావడం లేదు? అని అంతా అనుకుంటున్నారు. ఒక స్థాయికి వచ్చేవరకు మాత్రమే నేను మహేశ్ సాయం తీసుకున్నాను.

ఆ తరువాత కూడా ఆయన పేరును వాడుకుంటూ ఎదగాలని అనుకోలేదు. ఒక కో స్టార్ గా , బంధువుగా కూడా మహేష్ చేసే సూచనలు కూడా సింపుల్ గానే ఉంటాయి` అని అన్నారు. ఇక మ‌హేష్ లో మునుప‌టి కంటే ఇప్పుడు ఎన్నో మార్పులొచ్చాయి. ఒక‌ప్పుడు చాలా త‌క్కువ‌గా మాట్లాడేవారు. రిజ‌ర్వ్ గా క‌నిపించే వారు. కానీ ఇప్పుడు రూట్ మార్చేసారు. ఎంతో స‌ర‌ద‌గా, మీడియాతో సైతం జోకులేసి మాట్లాడుతున్నారు. త‌న సినిమా రిలీజ్ అవుతుందంటే? ఎంతో యాక్టివ్ గా ప్ర‌చారంలో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే.