Begin typing your search above and press return to search.

ఇక సెప్పేదేం లేదు సేసేదే.. సుధీర్ బాబు వేరే లెవల్!!

ఇప్పుడు మరికొద్ది గంటల్లో హరోం హర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సుధీర్ బాబు.

By:  Tupaki Desk   |   13 Jun 2024 9:23 AM GMT
ఇక సెప్పేదేం లేదు సేసేదే.. సుధీర్ బాబు వేరే లెవల్!!
X

దివంగత కృష్ణ అల్లుడిగా, సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సుధీర్ బాబు. మూవీ రిజల్ట్ తో ఎలాంటి సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినీ ప్రియులను అలరిస్తున్నారు. కానీ కొన్నేళ్లుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. సమ్మోహనం తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇప్పుడు మరికొద్ది గంటల్లో హరోం హర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సుధీర్ బాబు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుమంత్ జి.నాయుడు గ్రాండ్ గా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్లు, టీజర్, ట్రైలర్ మాసివ్ రెస్పాన్స్ పొందాయి. మూవీ పై ఆడియన్స్ లో సూపర్ హైప్ క్రియేట్ చేశాయి.

దీంతో హరోం హర మూవీపై సుధీర్ బాబు భారీ ఆశలు పెట్టుకున్నారు. అందుకు గాను వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ జోరుగా ప్రమోషన్స్ నిర్వహించారు. ఇక మూవీ మరి కొన్ని గంటల్లో రిలీజ్ అవ్వనున్న వేళ.. మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ టీజర్ ను విడుదల చేసి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు. 'వాడు శరత్ రెడ్డి మనిషి అన్నా' అని చెప్పిన వెంటనే.. సుధీర్ బాబు ఒక్క కిక్ తో విలన్ ను పడగొట్టిన సీన్ తో టీజర్ పవర్ ఫుల్ గా స్టార్ట్ అయింది.

ఆ తర్వాత కాలర్ ఎగరేసిన సుధీర్ బాబును వేరే లెవల్ లో చూపించారు మేకర్స్. అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ గ్లింప్స్ యాడ్ చేశారు. ఆ సమయంలో సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం లాంటి వెపన్ తో చితకొట్టేశారు హీరో. చివర్లో ఇక సెప్పేదేం లేదు సేసేదే అన్న డైలాగ్ మాత్రం అదిరిపోయింది. మొత్తానికి రిలీజ్ టీజర్ ఓ రేంజ్ లో ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ కొత్త టీజర్ చూసి.. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని అంటున్నారు నెటిజన్లు.

ఇక టీజర్ లో సుధీర్ బాబు ఫుల్ మాస్ లుక్ లో తన నటనతో దుుమ్ముదులిపేశారు. యాక్షన్ సీక్వెన్స్ లో కూడా అదరగొట్టారు. విజువల్స్ నేచురల్ గా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆసక్తి పెంచుతోంది. మొత్తానికి మూవీ మంచి హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఉండనున్నట్లు అర్థమవుతోంది. మాళవిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సునీల్, రవి కాలే, కేశవ్ దీపక్ ముఖ్య పాత్రలు పోషించారు. మరి ఈ సినిమాతో సుధీర్ బాబు ఎలాంటి విజయం అందుకుంటారో చూడాలి.