అప్పటి నుంచే గొడవ.. డబ్బు కోసమే ఇదంతా!: హర్ష సాయి లాయర్
ప్రస్తుతం దీనిపై హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
By: Tupaki Desk | 25 Sep 2024 10:22 AM GMTసోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, యూట్యూబర్ హర్ష సాయిపై రే*ప్ కేసు నమోదు అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫ్రెండ్ గా పరిచయం అయ్యి.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. తన వద్ద డబ్బులు తీసుకుని చీట్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. పలుమార్లు తనపై హర్షసాయి అత్యాచారానికి పాల్పడ్డాడని, న్యూ*డ్ వీడియోస్, ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కంప్లెంట్ చేసింది.
ప్రస్తుతం దీనిపై హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అదే సమయంలో హర్ష సాయి పరారీలో ఉన్నాడని రూమర్లు వస్తున్న వేళ.. అతడు సోషల్ మీడియాలో స్పందించిన విషయం తెలిసిందే. తనపై వస్తున్న ఆరోపణలు అబద్ధాలని చెప్పాడు. తన లాయర్ టి. చిరంజీవి.. కేసుకు సంబంధించి మాట్లాడతారని చెప్పగా.. ఆయన తాజాగా పలు కీలక విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం హర్ష సాయి లాయర్ వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
హర్ష సాయిపై వస్తున్న ఆరోపణలు.. కట్టుకథలని అన్నారు లాయర్ చిరంజీవి. అతను ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు. అన్నీ అబద్ధాలేనని చెప్పారు. అంత అవసరం అతనికి లేదని వివరించారు. యూట్యూబర్ గా ఒక వీడియో పెడితే.. మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయని గుర్తు చేశారు. వేరే లెవెల్ లో అతనికి పాపులారిటీ ఉందని తెలిపారు. దాన్ని పాడు చేసేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా డబ్బు కోసమే ఆ అమ్మాయి ఇలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు!
కొన్నేళ్ల ముందు వరకు హర్ష సాయికి, బాధితురాలికి పరిచయం లేదని తెలిపారు. హర్ష సాయి ఎక్కడికి పరారవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి తప్పు లేకుండా అతని నాన్నపై కూడా ఫిర్యాదు చేశారని అన్నారు. హర్ష సాయి ఫాదర్ రాధాకృష్ణ.. ఒక్కసారి కూడా బాధిత యువతిని కలవలేదని తెలిపారు. చెప్పాలంటే.. ఆయన కనీసం చూడలేదు కూడా అని వెల్లడించారు. పూర్తి వివరాలతో న్యాయపరంగా ఈ విషయాన్ని డీల్ చేస్తామని తెలిపారు లాయర్.
అయితే గతంలో హర్ష సాయి, బాధితురాలు కాంబోలో ఓ సినిమా ప్రారంభమైంది. ఇప్పుడు ఆ విషయాన్ని కూడా లాయర్ ప్రస్తావించారు. హర్ష సాయిని హీరోగా పెట్టి సినిమా తీయడానికి ఆమె రెడీ అయిందని తెలిపారు. ప్రముఖ ఓటీటీలో మూవీ కోసం ఇద్దరి మధ్య డీల్ జరిగిందని చెప్పారు. ఆ తర్వాత ఓ విషయంలో డిస్ట్రబెన్స్ వచ్చిందని.. అప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. మరి ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.