Begin typing your search above and press return to search.

హర్ష సాయి కాల్ రికార్డింగ్.. ఏం జరుగుతుంది?

అయితే తనపై వచ్చిన ఆరోపణలపై హర్ష సాయి ఇప్పటికే స్పందించాడు.

By:  Tupaki Desk   |   25 Sep 2024 9:41 AM GMT
హర్ష సాయి కాల్ రికార్డింగ్.. ఏం జరుగుతుంది?
X

యూట్యూబర్‌ హర్ష సాయిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తనపై అత్యాచారం చేశాడని, న*గ్న చిత్రాలు సేకరించి బ్లాక్‌ మెయిల్‌ చేశాడని సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక ప్రైవేటు పార్టీలో కలిసి ఫ్రెండ్ గా ఉంటూ పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేసినట్లు, దాంతోపాటు పెద్ద మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నట్లు బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. హర్ షసాయి తండ్రిపైనా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

అయితే తనపై వచ్చిన ఆరోపణలపై హర్ష సాయి ఇప్పటికే స్పందించాడు. తన ఇన్‌ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టాడు. తన పై వచ్చిన కామెంట్స్ అన్ని అబద్దాలేనని తెలిపాడు. డబ్బు కోసం చేస్తున్న ఆరోపణలు అవన్నీ అని చెప్పాడు. నా గురించి మీకు తెలుసు, నిజాలు అన్ని త్వరలో బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశాడు. అన్ని విషయాలు లాయర్ తానికొండ చిరంజీవి మాట్లాడతారని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు అతడి కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో సోషల్ మీడియాలో కొన్ని రోజుల క్రితం, హర్ష సాయి- బాధితురాలి మధ్య జరిగిన ఫోన్ కాల్ రికార్డింగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో గట్టిగా అరుస్తూ, ఏడుస్తూ బాధితురాలు.. హర్ష సాయితో గొడవపడుతున్నట్లు కనిపిస్తుంది. జనవరి 23వ తేదీన మాట్లాడినట్లు తెలుస్తోంది. తనను ప్రేమించమని పలుమార్లు అడుగుతున్నట్లు అర్థమవుతుంది. హర్ష మాత్రం సింపుల్ గా నవ్వుతున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది.

"ఎక్కడికైనా బయటకు వెళ్దాం అంటే పనులు ఉంటాయంటావ్.. ఏం చేద్దామని అనుకుంటున్నావ్.. ప్రేమించాలని మనుసులో లేదా.. వయసు పోతోంది.. వేరే ఎవరైనా ఇష్టమా అంటే అలా ఏం లేదని అంటావ్.. నన్నేం చేయమంటావ్ చెప్పు. ఇప్పటి దాకా చేసింది చాలు అంటావ్.. టైమ్ తీసుకో.. ఆలోచించు. బ్లాంకెట్ కప్పుకుని ఎన్నిసార్లు అడగాలి. ఇదేంటి అసలు.. నేను నీకు చెబుతుంది అర్థం కావడం లేదా" అంటూ బాధితురాలి మాట్లాడగా.. అతడు చిన్నగా నవ్వుతున్నాడు.

ప్రస్తుతం ఆ కాల్ రికార్డింగ్ వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నానికి చెందిన హర్ష సాయి పేదలకు ఆర్థిక సాయం చేస్తూ వీడియోలు తన ఛానెల్‌లో అప్లోడ్ చేస్తుంటాడు. అలా చాలా క్రేజ్ సంపాదించుకున్నాడు. అతడు పోస్ట్ చేసిన వీడియోలు ఫుల్ ట్రెండ్ అవుతుంటాయి. హర్షసాయి హీరోగా బాధిత యువతి హీరోయిన్‌ గా గతంలో ఒక సినిమా కూడా స్టార్ట్ అయింది. మరి ఈ విషయం.. ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.