స్పిరిట్ కు ముహూర్తం ఫిక్స్
ఈ సినిమాల తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాను చేయాల్సి ఉంది.
By: Tupaki Desk | 19 Feb 2025 6:41 AM GMTకల్కి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ చేస్తున్న ప్రభాస్ దాంతో పాటూ సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమాను కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలను పూర్తి చేయడంలో ప్రభాస్ చాలా బిజీగా ఉన్నాడు.
ఈ సినిమాల తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాను చేయాల్సి ఉంది. యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా చేస్తున్న సినిమా ఇది. దీంతో స్పిరిట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు స్పిరిట్ సినిమా మొదలవుతుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం స్పిరిట్ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాల్ని ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ వెల్లడించాడు. ఆల్రెడీ స్పిరిట్ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయని, ఉగాది రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలవుతుందని హర్షవర్ధన్ తెలిపాడు.
హర్షవర్ధన్ చేసిన కామెంట్స్ విని ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్ లో తెరకెక్కించనున్నట్టు ఇప్పటికే పలు వార్తలొచ్చాయి. స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని డైరెక్టర్ సందీప్ ఆల్రెడీ చెప్పాడు. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తాడని టాక్ వినిపిస్తోంది.
స్పిరిట్ లో ప్రభాస్ పాత్ర చాలా విభిన్నంగా, హై ఓల్టేజ్ యాక్షన్ తో ఉండబోతుందని సమాచారం. మునుపెన్నడూ చూడని విధంగా ప్రభాస్ ను స్పిరిట్ లో చూపించబోతున్నాడట. ప్రభాస్ తన కెరీర్లోనే మొదటిసారి ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.