Begin typing your search above and press return to search.

వంగా మ్యూజిక్ డైరెక్టర్.. జాక్ పాట్ కొట్టేశాడా?

సందీప్ రెడ్డి వంగా అల్లు అర్జున్ హీరోగా చేయబోయే సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో పాటు సాంగ్స్ కూడా కంపోజ్ చేసే అవకాశం హర్షవర్ధన్ రామేశ్వర్ సొంతం చేసుకునే ఛాన్స్ ఉందట.

By:  Tupaki Desk   |   28 Dec 2023 4:00 AM GMT
వంగా మ్యూజిక్ డైరెక్టర్.. జాక్ పాట్ కొట్టేశాడా?
X

యానిమల్ సినిమా తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు ఒక్కసారిగా ట్రెండ్ అవుతోంది. ఎవరా మ్యూజిక్ డైరెక్టర్ అని తెలుసుకోవడానికి ఇంటర్నెట్ నెటిజన్లు గట్టిగానే వెతికేస్తున్నారు. యానిమల్ లో సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అయితే అందులో ఒక్కో పాటకు ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేశాడు. కానీ వాటికంటే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సందీప్ రెడ్డి విజన్ కి సరిపోయే విధంగా ఉండటంతో భాగా క్లిక్ అయ్యింది.


బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందించారు. సందీప్ రెడ్డి మొదటి సినిమా అర్జున్ రెడ్డికి కూడా ఇతనే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించడం విశేషం. అలాగే కబీర్ సింగ్ కి కూడా. ఈ సినిమాలతోనే హర్షవర్ధన్ పేరు భాగా పాపులర్ అయ్యింది. అయితే అర్జున్ రెడ్డితోనే అసలైన కెరియర్ స్టార్ట్ చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ సాక్ష్యం సినిమాకి మ్యూజిక్ అందించారు.

తరువాత చిన్న సినిమాలు ఎక్కువ చేశారు. రవితేజ రావణాసుర మూవీకి కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ ని హర్షవర్ధన్ అందించారు. అయితే యానిమల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇతని పేరు పాపులర్ అయ్యింది. ఇప్పటి వరకు కెరియర్ లో 21 సినిమాకి హర్షవర్ధన్ కంపోజర్ గా వర్క్ చేశారు. ప్రస్తుతం ఇతని చేతిలో ఆరు సినిమాల వరకు ఉన్నాయి.

వాటిలో మేగ్జిమం చిన్న సినిమాలే కావడం విశేషం. అందులో కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా కూడా ఉంది. అయితే ఇప్పుడు హర్షవర్ధన్ ఊహించని జాక్ పాట్ ని అందుకోబోతున్నాడు. సందీప్ రెడ్డి వంగా అల్లు అర్జున్ హీరోగా చేయబోయే సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో పాటు సాంగ్స్ కూడా కంపోజ్ చేసే అవకాశం హర్షవర్ధన్ రామేశ్వర్ సొంతం చేసుకునే ఛాన్స్ ఉందట. ఈ సినిమాతో కచ్చితంగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ స్టార్ మారిపోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

అలాగే స్పిరిట్ సినిమాకి కూడా హర్షవర్ధన్ వర్క్ చేసే అవకాశం ఉంది. సందీప్ రెడ్డికి భాగా సింక్ అవ్వడంతో బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం అతన్నే తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. యానిమల్ తో బాలీవుడ్ రేంజ్ లో సత్తా చాటిన హర్షవర్ధన్ కి హిందీ నుంచి ఏమైనా పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా అనేది చూడాలి.