Begin typing your search above and press return to search.

అవ‌కాశాల్లేక కార్పెంట‌ర్‌గా ప‌ని చేసిన యంగ్ హీరో

అంతేకాదు చిన్న వయసులోనే తన తల్లిదండ్రులను, ఇంటిని విడిచిపెట్టిన తర్వాత డబ్బు సంపాదించడానికి .. జీవించడానికి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి హ‌ర్ష్ వెల్ల‌డించాడు.

By:  Tupaki Desk   |   1 April 2025 3:49 AM
అవ‌కాశాల్లేక కార్పెంట‌ర్‌గా ప‌ని చేసిన యంగ్ హీరో
X

తెలుగు చిత్ర‌సీమ‌లో హీరో అయ్యి, అటుపై బాలీవుడ్ కి వెళ్లాడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే. ప్రారంభం అవ‌కాశాల్లేవ్. చాలా క‌ష్టాల‌ను ఎదుర్కొన్నాడు. అత‌డు న‌టించిన `స‌న‌మ్ త‌రి క‌స‌మ్` క‌రోనా క్రైసిస్ స‌మ‌యంలో విడుద‌లై ఫ్లాపైంది. కానీ అదే సినిమాని ఇటీవ‌ల రీరిలీజ్ చేయ‌గా బంప‌ర్ హిట్టు కొట్టింది. థియేట‌ర్ల‌లో ఈ సినిమా రెండో విడుద‌ల‌లో ఘ‌న‌విజ‌యం సాధించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.


అంతేకాదు ఈ సినిమాలో న‌టించిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణేకి మంచి పేరొచ్చింది. ఇక ఇదే హుషారులు అత‌డు త‌న త‌దుప‌రి సినిమాల్ని ప‌ట్టాలెక్కించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో హర్షవర్ధన్ రాణే నటుడిగా విజయం సాధించడానికి ముందు తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఓపెన‌య్యాడు. తాను కోరుకున్న పాత్రలు లభించకపోవడంతో కార్పెంట‌ర్ గా పని చేయాల్సి వచ్చిన సమయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

అంతేకాదు చిన్న వయసులోనే తన తల్లిదండ్రులను, ఇంటిని విడిచిపెట్టిన తర్వాత డబ్బు సంపాదించడానికి .. జీవించడానికి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి హ‌ర్ష్ వెల్ల‌డించాడు. రోజుకు కనీసం ఒక పూట భోజనం చేయడం కోసం చాలా ఉద్యోగాలు చేయాల్సి వ‌చ్చింద‌ని తెలిపాడు. అతడు సర్వెంట్ ఉద్యోగాలు చేసాడు. రెస్టారెంట్ల వంటగది నేలపై పడుకున్నాడు. కార్పెంటర్, డెలివరీ బాయ్ , డీజే అసిస్టెంట్‌గా పనిచేసాన‌ని తెలిపాడు.

హర్షవర్ధన్ రాణే తాను ఎదుర్కొన్న కష్టాల గురించి జూమ్ తో మాట్లాడాడు

కేవలం రూ. 200 తో తన ఇంటి నుండి పారిపోయిన తర్వాత డబ్బు సంపాదించడానికి.. జీవించడానికి ఎదుర్కొన్న పోరాటాల స‌మ‌యంలోనే హైదరాబాద్‌లో కార్పెంట‌ర్ గా ప‌ని చేసాన‌ని అన్నాడు. ఆ పని చేస్తున్నప్పుడు నాకు కావలసిన పని దొరకలేదు. నేను స్టేషన్ దగ్గర పాత ఫర్నిచర్ కొని, దానిని రిపెయిర్లు చేసి ఆపై దానిని అమ్మేవాడిని అని తెలిపాడు. డబ్బు, స్వాతంత్య్రం చాలా ముఖ్య‌మ‌ని అన్నాడు.

దేవుడు మనకు ఇచ్చిన దాని వల్ల.. మనుగడ ప్రవృత్తి వల్ల.. మానవులందరూ ఈ క‌ష్టాల‌ను అధిగమించగలరని నేను నమ్ముతున్నాను. మనం చేసే ప‌నిపై దృష్టి పెట్టాలి. ముందుకు సాగే మార్గాలను కనుగొనాలి. నా భయం పోయింది. నేను ఇకపై డబ్బు కోసం లేదా సంపదకు భయపడను. అది ఉంటే ఉంటుంది.. లేకపోతే లేదు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. హర్షవర్ధన్ రాణే ఇటీవల తన త‌దుప‌రి చిత్రం `దీవానీయత్‌`ను ప్రకటించారు. ఈ ఏడాదిలోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. మిలాప్ జవేరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరి.