Begin typing your search above and press return to search.

దుల్కర్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

లక్కీ భాస్కర్ కోసం భారీ సెట్ వేశారు. అందుకే కాస్త ఒంట్లో బాగాలేకపోయినా సినిమా పూర్తి చేయాలని షూట్ చేశామని అన్నారు దుల్కర్ సల్మాన్

By:  Tupaki Desk   |   22 Oct 2024 1:30 PM GMT
దుల్కర్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!
X

తెర మీద అందంగా కనిపించే ప్రతి హీరో ప్రతి సినిమాకు తను పడే కష్టం ఎంత అన్నది ఆడియన్స్ కు తెలియదు. కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమాను మనం రెండు నిమిషాల రివ్యూ తో తేల్చి చెప్పేస్తాం కానీ హిట్టు సినిమాకు ఒకలా ఫ్లాప్ సినిమాకు మరోలా హీరోలు కష్టపడరు. హీరోలు చేసే షూటింగ్ ని ఆఫ్ స్క్రీన్ లో మేకింగ్ వీడియోలో చూపించేది చాలా తక్కువ. వారికి సినిమా పట్ల ఉన్న డెడికేషన్ ఎలాంటిదో చెప్పడం కష్టం.

ఎలాంటి కష్టమైనా సరే తాము పడుతూ ఫ్యాన్స్ కోసం రిస్క్ చేసి మరి నటిస్తుంటారు స్టార్స్. బాడీ సహకరించినా చేయకపోయినా సరే వారు పనిచేస్తూనే ఉంటారు. అలాంటి హార్డ్ వర్క్ హీరోలు చాలామంది ఉండగా వారిలో స్టార్ తనయుడు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా వస్తారు. సినిమా పట్ల ఆయనకు ఉన్న అంకితభావం గురించి ఇప్పటికే చాలాసార్లు చాలామంది చెప్పారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశారు. మహానటి. సీతారామం హిట్ తో దుల్కర్ సినిమాలకు టాలీవుడ్ లో డిమాండ్ పెరిగింది. ఐతే లక్కీ భాస్కర్ షూట్ టైం లో దుల్కర్ సల్మాన్ కొద్దిగా అన్ హెల్దీ ఫీల్ అయ్యారట. అయినా సరే రోజుకి 15 గంటల దాక షూట్ చేశారట. లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఇదే విషయాన్ని సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. లక్కీ భాస్కర్ కోసం భారీ సెట్ వేశారు. అందుకే కాస్త ఒంట్లో బాగాలేకపోయినా సినిమా పూర్తి చేయాలని షూట్ చేశామని అన్నారు దుల్కర్ సల్మాన్.

ఈ సినిమా చేస్తున్న టైం లో కొన్న్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయని.. దాని వల్ల సినిమా అనుకున్న టైం కు పూర్తి చేయలేదని అన్నారు. ఇదే కాదు మరో రెండు సినిమాలు చేయాల్సి ఉందని అన్నారు దుల్కర్. అందులో ఒక సినిమా అయినా ఈ ఏడాది రిలీజ్ చేయాలని అనుకున్నా అని అన్నారు దుల్కర్ సల్మాన్. మహానటుడు మమ్ముట్టి కొడుకుగా సినిమా మీద తనకున్న ప్రేమ, రెస్పెక్ట్ చూపిస్తున్నాడు కాబట్టే అతన్ని సౌత్ ఆడియన్స్ అంతా ఇష్టపడుతున్నారు.

ఇక లక్కీ భాస్కర్ విషయానికి వస్తే ఒక మిడిల్ క్లాస్ బ్యాంక్ ఎంప్లాయ్ లైఫ్ లో జరిగిన అద్భుతాలు వాటి వల్ల అతను ఎలా రిస్క్ ఫేస్ చేశాడన్న కథతో వస్తుంది.