చైతూ పెళ్లి రోజే రానా జోకులు.. ప్రోమో చూశారా?
ఈ ప్రోమోలో నాగచైతన్య, రానా భార్య మిహీకతో పాటు రానా కుటుంబ సభ్యుల హాజరుతో ఫ్యామిలీ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ చూపించారు.
By: Tupaki Desk | 4 Dec 2024 11:15 AM GMTరానా దగ్గుబాటి ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. హీరోగా, విలన్ గానే కాకుండా హోస్ట్ గా, నిర్మాతగా ఇండస్ట్రీలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. ఏది చేసినా కూడా ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తూ మంచి క్రేజ్ అందుకుంటున్నాడు.
ఇక లేటెస్ట్ గా తనదైన శైలిలో అమెజాన్ ప్రైమ్ టాక్ షో ‘ది రానా దగ్గుబాటి షో’ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే విడుదలైన రెండు ఎపిసోడ్స్ మంచి స్పందన పొందగా, తాజాగా మూడో ఎపిసోడ్ ప్రోమో విడుదల చేసి మరోసారి సందడి చేశారు రానా.
ఈ ప్రోమోలో నాగచైతన్య, రానా భార్య మిహీకతో పాటు రానా కుటుంబ సభ్యుల హాజరుతో ఫ్యామిలీ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ చూపించారు. ఈ ప్రోమోలో రానా, "మా ఫ్యామిలీ మొత్తం కలిసి సోది వేస్తే ఎలా ఉంటుందో తెలుసా?" అంటూ చిలిపిగా ప్రారంభించారు. ప్రోమోలో చైతు వ్యక్తిగత జీవితంపై రానా జోక్స్ వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చైతు పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అని అడగగా, చైతు తనదైన శైలిలో "బాగుంది" అని సమాధానం ఇచ్చారు.
ఇక రానా భార్య మిహీక కూడా తన సమాధానాలతో ఆ ఎపిసోడ్‌కు ప్రత్యేకమైన వైబ్ తీసుకువచ్చారు. ఈ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ప్రోమోలో చైతు-శోభిత సంబంధంపై రానా చమత్కారాలు చేయడం కూడా హైలైట్‌గా మారింది. ఈ సందర్భంలో చైతు-శోభిత ఫోటోలు చూపించడం, వారి ప్రేమ గురించి మాట్లాడడం ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది.
ఈ ఎపిసోడ్ ప్రేక్షకులకు శనివారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంటుంది. ఇక రానా ఫ్యామిలీతో కలిసి చేసిన ఈ ఎపిసోడ్ చూసేందుకు అందరూ ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, నేడు నాగచైతన్య-శోభిత వివాహం జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోలో రాత్రి వేడుక జరుగుతుందని సమాచారం. చైతు పెళ్లి రోజు గిఫ్ట్‌గా రానా ఈ ప్రోమో విడుదల చేశారని ఫ్యాన్స్ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. బావ బామ్మర్దులైన రానా చైతు చిన్నప్పటి నుండి మంచి స్నేహితులుగా ఉంటూ, ఈ షోలో తమ అనుబంధాన్ని మరోసారి బయటపెట్టారు.
ఈ ప్రోమో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. చైతు-శోభిత పెళ్లి నేపథ్యంలో విడుదల చేసిన ఈ ప్రోమోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శనివారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ ఎపిసోడ్ విడుదలయ్యాక ప్రేక్షకులను మరోసారి అలరించే అవకాశం ఉంది. మొత్తంగా, రానా తన టాక్ షోతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడంలో విజయవంతమవుతున్నారు. ఇక త్వరలోనే మరికొందరు స్టార్ సెలబ్రెటీలు ఈ షోలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.