Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ర‌ష్మిక‌లో ఈ కొత్త‌ కోణం చూశారా?

పుష్ప‌లో శ్రీ‌వ‌ల్లిని, గీత గోవిందంలో గీత‌ను అంత తేలిగ్గా మ‌ర్చిపోగ‌ల‌రా? అలాగే ఇప్పుడు మిల‌న్ ఫ్యాష‌న్ వీక్ 2024లో ర‌ష్మిక మంద‌న లుక్స్ ని మ‌ర్చిపోవ‌డం కూడా కుద‌ర‌దు.

By:  Tupaki Desk   |   22 Sep 2024 10:39 AM GMT
ఫోటో స్టోరి: ర‌ష్మిక‌లో ఈ కొత్త‌ కోణం చూశారా?
X

పుష్ప‌లో శ్రీ‌వ‌ల్లిని, గీత గోవిందంలో గీత‌ను అంత తేలిగ్గా మ‌ర్చిపోగ‌ల‌రా? అలాగే ఇప్పుడు మిల‌న్ ఫ్యాష‌న్ వీక్ 2024లో ర‌ష్మిక మంద‌న లుక్స్ ని మ‌ర్చిపోవ‌డం కూడా కుద‌ర‌దు. ఇదిగో అందుకు ఎగ్జాంపుల్ ఈ కొత్త ట్రెండీ లుక్. కావాలంటే మీరే చూడండి.

ర‌ష్మిక‌ను ఇలా కొత్త‌గా ట్రెండీగా చూడ‌డం ఇదే మొద‌టి సారి కాక‌పోవ‌చ్చు.. కానీ ఈసారి త‌న‌లో రెబ‌లిజం హ‌ద్దుమీరింది. పాశ్చాత్య‌ధోర‌ణి ప‌రాకాష్ట‌లో క‌నిపిస్తోంది. అయితే దీనికి కార‌ణం లేక‌పోలేదు. అది డిజైన్ చేసింది పాశ్చాత్య డిజైన‌ర్ కాబ‌ట్టి.. అందుకు సంబంధించిన మూలాలు ఈ డిజైన‌ర్ డ్రెస్ లో ఉన్నాయి.

రష్మిక మందన్న మిలన్‌లో ప్ర‌జ‌ల‌కు మ‌త్తెక్కిస్తోంది. అక్క‌డ ఫ్యాష‌న్ ఈవెంట్ల‌లో ఈ భామ‌ చాలా సరదాగా గడుపుతోంది. శనివారం మిలన్ ఫ్యాషన్ వీక్ ఆఫ్టర్ పార్టీకి ర‌ష్మిక‌ హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ర‌ష్మిక ధ‌రించిన స్పెష‌ల్ డ్రెస్ ఈవెంట్ కే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అంద‌రిలోను ర‌ష్మిక‌ షో స్టాప‌ర్ గా నిలిచింది. ఇంత‌కీ దీనిని డిజైన్ చేసిన‌ది ఎవ‌రు? అంటే ర‌ష్మిక‌తో పాటు ఫోటోల్లో క‌నిపించిన ఇటాలియ‌న్ ఫ్యాషన్ డిజైన‌ర్ `డోనాటెల్లా వెర్సాస్`. వెర్సాస్ ప్రస్తుత చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ అయిన డోనాటెల్లా, రష్మిక సహా ప్రపంచం నలుమూలల నుండి ప్రముఖులు ఈ ఆఫ్టర్ పార్టీలో పాల్గొన‌గా..స్పాట్ లో ర‌ష్మిక హైలైట్ అయింది. రష్మిక అద్భుతమైన ఐవరీ బ్లేజర్ డ్రెస్, గ్లామ్ మేకప్‌లో కనిపించింది. డోనాటెల్లా తన ప్రక్కనే ఉండి న‌వ్వుతూ పోజులిచ్చింది. షేర్ అయిన ఫోటోల రంగులరాట్నంలో హ్యుంజిన్, నార్మానీ, జిగి హడిద్, గియాకోమో జార్జియో, బీట్రైస్ వెండ్రామిన్, నవా మౌ , డెనిస్ కాపెజ్జా, జీన్ గల్లాఘర్ లాంటి ప్ర‌ముఖులు ఉన్నారు.

డోనాటెల్లా టైమ్‌లైన్‌లో రష్మిక పోస్ట్ ని చూసి ద‌క్షిణాది సినీప్రియులు సంతోషించారు. ``నేను ఆమెకు అభిమానిని కాదు కానీ త‌న‌ గురించి చాలా గర్వపడుతున్నాను. ఆమె ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చింది. మోడలింగ్ చేసింది.. సినిమాల్లో నటించడానికి ప్ర‌య‌త్నించింది. చాలా అనవసరమైన ద్వేషాన్ని ఎదుర్కొంది. కానీ ఆమె పట్టించుకోలేదు. చాలా భాషలు నేర్చుకుంది. నటనలో కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగింది. అన్నింటికీ తన కష్టమే కారణం. ఆమె సాధించడానికి ఇంకా చాలా మంచి విషయాలు ఉన్నాయని అనుకుంటున్నాను. నేను ఆమెకు మంచి జరగాలని కోరుకుంటున్నాను.. అని రెడ్డిట్‌లో ఒక వ్యక్తి రాశాడు. ఈ అమ్మాయికి ఆకాశమే హద్దు…అని ఒక‌రు రాసారు. కొరియ‌న్ల మ‌ధ్య భార‌తీయ‌త‌ను ర‌ష్మిక ఆవిష్క‌రించింద‌ని ఒక‌రు ప్ర‌శంసించారు. ర‌ష్మిక రెబ‌లిజం హ‌ద్దు మీరుతోంది అంటూ ఒక ఫ్యాష‌న్ ప్రియుడు స‌ర‌దాగా వ్యాఖ్యానించారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... విక్కీ కౌశల్ క‌థానాయ‌కుడిగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం `ఛావా`లో రష్మిక కనిపించనుంది. త‌దుప‌రి ధనుష్- నాగార్జున అక్కినేనితో కలిసి `కుబేర`లోను కనిపించనుంది. ది గర్ల్‌ఫ్రెండ్ లో ధీక్షిత్ శెట్టితో స్క్రీన్‌ను పంచుకుంటుంది. డిసెంబరు 6న థియేటర్లలో విడుదల కానున్న `పుష్ప: ది రూల్` సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.