29 ఏళ్లు.. 'బొంబాయి' జంటలో మార్పు కనిపెట్టారా?
ఇండస్ట్రీ బెస్ట్ హిట్స్ లో నటించడమే గాక, అత్యుత్తమమైన నాణ్యమైన పాత్రల్లో నటించి గొప్ప అభిమానులను సంపాదించుకున్నారు.
By: Tupaki Desk | 11 Feb 2024 3:27 AM GMT2024-1995 =29ఏళ్లు .. బొంబాయి రిలీజై దాదాపు మూడు దశాబ్ధాలు అవుతోంది. ఆ సినిమాలో నాయకానాయికలుగా నటించిన అరవింద స్వామి- మనీషా కొయిరాలా జంటకు అది ల్యాండ్ మార్క్ మూవీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత ఆ ఇద్దరూ కెరీర్ పరంగా పీక్స్ ని చూసారు. ఇండస్ట్రీ బెస్ట్ హిట్స్ లో నటించడమే గాక, అత్యుత్తమమైన నాణ్యమైన పాత్రల్లో నటించి గొప్ప అభిమానులను సంపాదించుకున్నారు.
ఇక ఈ జోడీ ఎక్కడ కనిపించినా కానీ వెంటనే బొంబాయి సినిమా గుర్తుకు వస్తుంది. హిందూ యువకుడు అరవింద స్వామికి ముస్లిమ్ యువతి మనీషా కొయిలారాకు మధ్య ప్రేమాయణం ఓవైపు.. మతఘర్షణలతో బొంబాయి అట్టుడికిపోయే పరిస్థితులు మరోవైపు.. అల్లర్ల నడుమ లవ్ స్టోరీని మెర్జ్ చేసి అద్భుతమైన దృశ్యకావ్యాన్ని తెరకెక్కించారు మణిరత్నం. అందుకే ఇన్నేళ్ల తర్వాత ఈ జోడీ ఇప్పుడు ఎలా ఉంది? అన్నది ఆరా తీస్తే.. క్యాన్సర్ ని జయించిన మనీషా కొయిరాలా ఇటీవల నటిగా స్పీడ్ పెంచింది.
అరవింద స్వామి చాలా గ్యాప్ తర్వాత మణిరత్నం సినిమాలతోనే పెద్ద తెరపైకి కంబ్యాక్ అయ్యాడు. అయితే అరవింద స్వామి బొంబాయి తార్వాత చాలా కాలం సినిమాల్లో నటించినా ఆ తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్ లోనే అతడికి పెద్ద యాక్సిడెంట్ అయిందని శరీరభాగాలు చచ్చుబడటంతో నటన విరమించాడని కూడా ప్రచారమైంది. కానీ దీనికి సరైన ఆధారం ఏదీ లేదు.
ఇటీవల అరవింద స్వామి తని ఒరువన్ - ధృవ- నవాబ్ లాంటి చిత్రాల్లో గ్రేట్ పెర్ఫామెన్స్ తో కట్టి పడేసాడు. మునుముందు క్లాసిక్ అనదగ్గ సినిమాల్లో నటిస్తున్నాడు. అతడి నుంచి మరిన్ని ఉత్తమమైన ప్రదర్శనలను వీక్షించేందుకు అవకాశం ఉంది. అలాగే మనీషా కొయిలారా ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న హీరామండి చిత్రంలో ఒక వేశ్యగా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ కి అద్భుత స్పందన వచ్చింది. ఇందులో సీనియర్ వేశ్యగా మనీషా అవార్డ్ స్థాయి ప్రదర్శనను ఇవ్వనుందని అర్థమవుతోంది. దాదాపు 29 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ ఎలా ఉన్నారు? అంటే ఇదిగో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోని చూడాలి. 50 ప్లస్ ఏజ్ లో ఎవరైనా ఎలా ఉంటారు? ఆ ఇద్దరూ విగ్గులు ధరించినట్టు ఈ ఫోటో ఆధారంగా నిలుస్తోంది. అయితే ఫేవరెట్ స్టార్లు ఏం ధరించినా అభిమానులు అవేవీ పట్టించుకోరు. వారి అద్భుతమైన నటనను ఆస్వాధించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.