Begin typing your search above and press return to search.

కల్కి 3 ప్రపంచాలను చూశారా? ఈ విషయాలు తెలుసా?

విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ.. నాగి టీమ్ మంచి ప్రమోషనల్ కంటెంట్‌ తో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   21 Jun 2024 8:16 AM GMT
కల్కి 3 ప్రపంచాలను చూశారా? ఈ విషయాలు తెలుసా?
X

కల్కి 2898 ఏడీ.. పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ కాంబో నుంచి వస్తున్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌ లో వైజయంతీ మూవీస్‌ బ్యానర్ పై అశ్వనీదత్.. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా.. మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ.. నాగి టీమ్ మంచి ప్రమోషనల్ కంటెంట్‌ తో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది.


దీంతో ఎక్కడ చూసినా కల్కి కోసమే చర్చ నడుస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో నాగి క్రియేట్ చేసిన ప్రపంచాలను చూసేందుకు ఈగర్ గా అంతా వెయిట్ చేస్తున్నారు. అయితే సినిమా ప్రమోషన్లు తగ్గాయని వార్తలు వచ్చిన సమయంలో.. నాగ్ అశ్విన్ వేరే లెవల్ ప్లాన్ తో ముందుకొచ్చారు. జర్నీ ఆఫ్ కల్కి పేరుతో ప్రీ లూడ్ వీడియోస్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో సినిమా ఎలా అయినా చూడాలని అంతా ఫిక్స్ అయిపోతున్నారు.


అయితే ప్రీ లూడ్ వీడియో-1లో కల్కి కథ పురాణాలన్నింటికీ క్లైమాక్స్‌ అని చెబుతూ సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశారు నాగి. కలియుగంలో ఏం జరుగబోతుంది? ఎలా జరగొచ్చు? అనే అంశాలతో తీశామని తెలిపారు. ఇప్పుడు రెండో వీడియోలో ఫ్యూచర్ వరల్డ్ ఎలా ఉంటుందో వివరించారు నాగ్ అశ్విన్. మూడు ప్రపంచాల మధ్య కథే కల్కి అని తెలిపారు. రీసెంట్ గా ఆ ప్రపంచాల పిక్స్ ను మేకర్స్ షేర్ చేయగా.. నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.


కాశీ ది లాస్ట్ సిటీ అంటూ నాగి క్రియేట్ చేసిన తొలి ప్రపంచానికి చెందిన పోస్టర్ ను షేర్ చేశారు మేకర్స్. పురాతన బ్యాక్ డ్రాప్ లో కట్టడాల మధ్య మనుషులు తిరుగుతున్నట్లు చూపించారు. అయితే భూమి మీద కాశీ తొలి నగరమని, అదే ఆఖరి సిటీ అయ్యి ఉంటే ఎలా ఉంటుందోనని ఊహించుకుని స్క్రిప్ట్ రాసుకున్నట్లు ఇప్పటికే తెలిపారు నాగ్ అశ్విన్. నాగరికత పుట్టిన కాశీని క్రియేట్ చేయడం ఇంట్రెస్టింగ్ అనిపించిందని కూడా చెప్పారు.

ఇక కాంప్లెక్స్ ప్రపంచాన్ని కూడా పరిచయం చేశారు మేకర్స్. కాంప్లెక్స్ లో నీరు, పచ్చదనం, సూర్యకాంతి పుష్కలంగా ఉన్నట్లు పోస్టర్ లో చూపించారు. ఇప్పటికే నాగ్ అశ్విన్.. భూమిపై లేని వాతావరణం, జంతువులు, ఆహారం ఇలా ప్రతిదీ కూడా అక్కడ ఉంటుందని తెలిపారు. ఒక స్వర్గం అనుకోవచ్చని రీసెంట్ గా నాగి చెప్పగా... పోస్టర్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఇక కల్కిలో మూడో ప్రపంచమైన శంభాలా పోస్టర్ వేరే లెవెల్ లో ఉంది. మూవీ టీమ్ కష్టమంతా ఇందులో ఫుల్ గా కనిపిస్తోంది. రాతి కట్టడాలు భారీగా ఉన్నాయి.

అయితే శంభాలా ప్రపంచంలో ఉన్న వారు కాంప్లెక్స్‌లో ఉన్న వారిని ఛాలెంజ్ చేస్తుంటారని నాగ్ అశ్విన్ వీడియోలో తెలిపారు. దేవుడిని బ్యాన్ చేసిన ప్రమంచమని చెప్పారు. అందుకు తగ్గట్లే పోస్టర్ కూడా ఉంది. మొత్తానికి ఈ మూడు పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. పోస్టర్లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని, సిల్వర్ స్క్రీన్ పై ఆ మూడు ప్రపంచాలను చూసేందుకు ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు నెటిజన్లు.